Saturday, November 16, 2024

కెనడాలో ప్రవాస భారతీయులకు వ్యతిరేకత

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: కెనడాలోని ప్రిన్స్ ఎడ్వర్ఢ్  ఐలాండ్స్ లో ప్రవాస భారతీయుల పర్మిట్లను 25 శాతం తగ్గించేశారు. చాలా మంది భారతీయ విద్యార్థులు డిపోర్టేషన్ సమస్యను ఎదుర్కొంటున్నారు.  భారతీయ విద్యార్థులు తమ వర్క్ పర్మిట్లను విస్తరించాలని డిమాండ్ చేస్తుండగా అక్కడి స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ప్రవాసుల కారణంగా తమకు ఉపాధి లభించడం కష్టమైపోతోందని స్థానికులు అంటున్నారు. ప్రవాసుల తాకిడి ఎక్కువ అవుతుండడంతో ప్రిన్స్ ఎడ్వర్ఢ్ ఐలాండ్స్ కొన్ని నియమాలు మార్చింది. అది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతోంది. ప్రిన్స్ ఎడ్వర్ఢ్ ఐలాండ్స్ స్థానికులు ఇప్పుడైతే మరింత మంది ప్రవాసులు అవసరం లేదని అంటున్నారు.

ఇమ్మిగ్రేషన్ పాలసీలో మార్పులకు కారణం హౌజింగ్, హెల్త్ కేర్, జాబ్స్ అని తెలుస్తోంది. దాంతో ఇమ్మిగ్రేషన్ పర్మిట్లలో 25 శాతం కోత విధించారు. కెనడాలో శాశ్వత నివాసం పొందేందుకు స్టూడెంట్ వీసాను దుర్వినియోగం చేస్తున్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ చేతిలో నుంచి అవకాశాలు జారీపోతున్నాయని వారు భావిస్తున్నారు.

‘‘వారు వాస్తవాలను గుర్తించడం లేదు. మేమేమి జనులకు వ్యతిరేకులం కాము. ఫ్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్ ఇప్పటికే నిండిపోయింది. మాకే సరిగ్గాలేదు. మేమేమి ప్రవాసులను కెనడాకు తేవొద్దని అనడం లేదు. పరిస్థితులు ప్రస్తుతం సానుకూలంగా లేవు’’ అని ఓ వ్యక్తి టోరొంటో విలేకరికి తెలిపారు.

డేటా కూడా అక్కడి ప్రజల వాదనకు అనుకూలంగా ఉంది. ‘‘ ప్రిన్స్ ఎడ్వర్ఢ్ ఐలాండ్ లో 2018లో 1070 కి స్లాట్స్ ఇచ్చారు. 2023కల్లా అది 2050కు పెరిగింది. ఇప్పుడు 25 శాతం కోత విధించడంతో ఆ సంఖ్య 2024లో 1600 కు చేరింది. అయినప్పటికీ అది 2018 తో పోలిస్తే 75 శాతం ఎక్కువే’’ అని ‘కరిస్టాక్’ నివేదించింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News