కెనరాబ్యాంకు సిఎస్ఆర్ నిధులతో రూ.10 లక్షల విలువైన పరికరాలు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థకు కెనరాబ్యాంకు అధికారులు సామాజిక బాధ్యతగా రూ.10 లక్షల విలువైన పరికరాలను సిఎస్ఆర్ నిధులతో అందజేశారు. బుధవారం హైటెక్‌సిటీ సమీపంలోని బొటానికల్ గార్డెన్ నిర్వహణకు ట్రాక్టర్‌తో పాటు ట్యాంకర్‌ను బ్యాంక్ సిజిఎం కెహెచ్ పట్నాయక్ చేతుల మీదు అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బోటానికల్ గార్డెన్ విలువైన ప్రకృతి సంపద అన్నారు. తమ వంతు బాధ్యతగా సిఎస్ఆర్ నిధులతో విలువైన పరికరాలను అందజేశామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ వైస్‌చైర్మన్ జి.చంద్రశేఖర్‌రెడ్డి, జిఎం రవీందర్‌రెడ్డి, భాస్కరచక్రవర్తి, మమతాజోషి, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.