Wednesday, January 22, 2025

ఎల్లుండి సుప్రీంలో విచారణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం జారీ చే సిన జీవో 29ని రద్దు చేయాలని కోరుతూ గ్రూప్-1 అభ్యర్థు లు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 29 వల్ల క లిగే నష్టాన్ని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించా రు. అయితే జీవో 29 రద్దు పిటిషన్‌పై  సోమవారం విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు వెల్లడించింది. అయితే, తీర్పు వచ్చే వరకు పరీక్షను వాయిదా వేయాలని పిటిషనర్‌లు కోరారు. జీవో 29 వల్ల తమకు నష్టం జరుగుతుందని గ్రూప్-1 అభ్యర్థులు న్యాయవాది ద్వారా కోర్టుకు వెల్లడించారు. ఈ జీవో శాపంగా మారిందని వెల్లడించారు. జీవో 55ను అమలు చేయాలని తాము సిఎంను కోరినప్పటికీ పట్టించుకోలేదని కోర్టుకు వెల్లడించారు. తమను పోలీస్ స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు. అనంతరం, సుప్రీంకోర్టు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News