Wednesday, January 22, 2025

బ్రెస్ట్ మిల్క్ వ్యాపారీకరణ లైసెన్సుల రద్దు

- Advertisement -
- Advertisement -

మానవ బ్రెస్ట్ మిల్క్ సేకరణ, ప్రాసెస్, వ్యాపారీకరణను అనుమతిస్తూ ప్రైవేట్ సంస్థలకు మంజూరు చేసిన లైసెన్సులను రద్దు చేయవలసిందని కర్నాటక ప్రభుత్వాన్ని తాను ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. మునెగౌడ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు విచారిస్తున్నది. బ్రెస్ట్ మిల్క్ సేకరణ, విక్రయం ద్వారా బహుళ జాతి సంస్థలు లాభాలు ఆర్జిస్తుండడం పట్ల మునెగౌడ ఆందోళన వ్యక్తం చేశారు. అటువంటి లైసెన్సులపై చర్య తీసుకోవలసిందిగా కర్నాటక ప్రభుత్వాన్ని కేంద్ర ఆయుష్ మంత్రిత్వశాఖ ఇటీవల ఆదేశించిందని కర్నాటక హైకోర్టుకు సంబంధించిన అదనపు సొలిసిటర్ జనరల్ అర్వింద్ కామత్ పిల్ విచారణ సమయంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌వి అంజరియా, న్యాయమూర్తి కెవి అరవింద్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనానికి తెలియజేశారు. కేంద్రం ఆదేశాల దృష్టా రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ సంస్థలకు జారీ చేసిన పలు లైసెన్సులను రద్దు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News