Monday, December 23, 2024

మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వంపై వేటు?

- Advertisement -
- Advertisement -

తృణమూల్ కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడబోతోందా? ఎథిక్స్ కమిటీ నివేదికను బట్టి చూస్తే, వేటు పడటం ఖాయమని తెలుస్తోంది. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు డబ్బు తీసుకున్నట్లు పుచ్చుకున్నట్లు మొయిత్రాపై వచ్చిన ఆరోపణలపై ఎథిక్స్ కమిటీ దర్యాప్తు జరిపిన విషయం తెలిసిందే. మొయిత్రా చేసిన పని అనైతికమైనదని, ఆమె లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కమిటీ తన నివేదికలో సూచించింది.

ఈ నివేదికపై చర్చించేందుకు గురువారం బీజేపీ ఎంపి వినోద్ కుమార్ సోంకార్ నాయకత్వంలో కమిటీ సమావేశమైంది. కమిటీలోని ఆరుగురు సభ్యులు నివేదికను సమర్థించగా, నలుగురు వ్యతిరేకించారు. తన నివేదికను కమిటీ లోక్ సభ స్పీకర్ కు పంపించనుంది. నివేదికను పరిశీలించి, తగు చర్యలు చేపట్టవలసిందిగా స్పీకర్ ను కోరనుంది. లోక్ సభలో ప్రశ్నలు అడిగేందుకు మొయిత్రా… పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి డబ్బులు తీసుకున్నారని బీజేపి ఎంపి నిషికాంత్ దూబే, న్యాయవాది జై అనంత్ ఆరోపణలు చేశారు. దీనిపై కమిటీ విచారణ చేపట్టి, 500 పేజీలతో ఒక నివేదికను రూపొందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News