హైదరాబాద్: వివిధ కారణాల రీత్యా విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్ మార్గాల్లో నడిచే 18 రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. మరో 6 రైళ్లను దారి మళ్లీస్తున్నట్టు అధికారులు తెలిపారు. తిరుపతి టు కాట్‌పాడి (07581 రైల్ నెంబర్), 07660 కాట్‌పాడి టు తిరుపతి, 17228 గుంటూరు టు ధోనీ, 17227 ధోనీ టు గుంటూరు, 07791 కాచిగూడ టు నడికూడ, 07792 నడికూడ టు కాచిగూడ, 07779 గుంటూరు టు మంచిర్యాల, 07780 మంచిర్యాల టు గుంటూరు, 07580 మంచిర్యాల టు నడికూడ, 07579 నడికూడ టు మంచిర్యాల, 07575 తెనాలి టు విజయవాడ, 07279 విజయవాడ టు తెనాలి, 07466 రాజమండ్రి టు విశాఖపట్నం,
07467 విశాఖపట్నం టు రాజమండ్రి, 17267 కాకినాడ ఫోర్ట్ టు విశాఖపట్నం, 17268 విశాఖపట్నం టు కాకినాడ ఫోర్ట్, 17258 కాకినాడ ఫోర్ట్ టు విజయవాడ, 17257 విజయవాడ టు కాకినాడ ఫోర్ట్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. 07337 హుబ్లీ టు గుంతకల్, 07338, 16854 విల్లుపురం టు తిరుపతి, 16853 తిరుపతి టు విల్లుపురం, 07889 రాప్రోల్ టు మార్కాపురం రోడ్డు, 07890 మార్కాపురం రోడ్డు టు తెనాలికి వెళ్లే రైళ్లను దారి మళ్లీంచినట్టు దక్షిణమధ్య రైల్వే అధికారులు తెలిపారు.