Friday, December 20, 2024

ఎపి, తెలంగాణల మధ్య నడిచే 52 రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నడిచే 52 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దుచేసింది. ఈ సర్వీసులను మంగళవారం నుంచి ఈ నెలాఖరు వరకు నిలిపివేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఇందులో జన్మభూమి ఎక్స్‌ప్రెస్, గరీబ్థ్‌త్రో పాటు విశాఖ, -చెన్నై, తిరుపతి, -భువనేశ్వర్, హైదరాబాద్-, కటక్‌ల మధ్య నడిచే రైళ్లు కూడా ఉన్నాయని అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్- టు విశాఖపట్నం మార్గంలో జన్మభూమి(12805-, 12806), గరీబ్థ్ (12739,-12740), రాజమండ్రి- టు విజయవాడ టు -రాజమండ్రి (07767/68), విజయవాడ- టు రాజమండ్రి- టు విజయవాడ (07459/60) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 23వ తేదీ వరకు కటక్- టు హైదరాబాద్ (07166) రైలును రద్దు చేశారు. ఈనెల 27వ తేదీ వరకు కాకినాడ టౌన్ టు -లింగంపల్లి (12775), లింగపల్లి- టు కాకినాడ టౌన్ (12776), విశాఖపట్నం టు -సికింద్రాబాద్ టు -విశాఖపట్నం (12783/84) రైళ్లు రద్దయ్యాయి. ఈ నెల 29వ తేదీ వరకు విశాఖపట్నం టు -లింగంపల్లి (12805), విశాఖపట్నం- టు మహబూబ్‌నగర్ (12861) , 30వ తేదీ వరకు లింగంపల్లి- టు విశాఖపట్నం (12806), మహబూబ్‌నగర్- టు విశాఖపట్నం (12862) రైళ్లను అధికారులు రద్దు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News