Monday, December 23, 2024

సిఎం కీలక నిర్ణయం.. సలహాదారుల నియామకాలు రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని బిఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన ఏడుగురు సలహాదారులను తొలగిస్తూ నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో ముఖ్యమంత్రి సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, మైనారిటీ సంక్షేమ సలహాదారు ఏకే ఖాన్, ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, పోలీస్ లా అండ్ ఆర్డర్, క్రైమ్ కంట్రోల్ అడ్వైజర్ అనురాగ్ శర్మ, వ్యవసాయ ముఖ్య సలహాదారు చెన్నమనేని రమేశ్, అటవీ వ్యవహారాల సలహాదారు ఆర్ శోభ ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News