- Advertisement -
న్యూఢిల్లీ : దేశవ్యాప్త సాధారణ సైనిక సిబ్బంది నియామకాలను సైనిక విభాగం రద్దు చేసింది. ఈ విషయాన్ని ఆదివారం అధికారికంగా తెలిపారు. సంబంధిత రిక్రూట్‌మెంట్ పరీక్షల పత్రం లీక్ అయినట్లు గుర్తించడంతో వెంటనే నియామకాల ప్రక్రియను రద్దు చేశారు. ఈ లీకేజీ సంబంధించి పుణేలో ఇప్పటివరకూ ముగ్గురిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అభ్యర్థుల అర్హతల ప్రాతిపదికలకు సంబంధించి ఎటువంటి అవతకవకలకు భారతీయ సైన్యం అవకాశం ఇవ్వదని, లీక్ అయినట్లు గుర్తించి రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేసినట్లు వివరించారు.
- Advertisement -