Sunday, January 19, 2025

సిపిఎస్ రద్దు పై తొలి సంతకం చేయాలి: సిపిఎస్ టిఈఎటిఎస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భాగస్యామ్య పింఛను పథకం ను రద్దు చేసి, పాత పెన్షన్ పథకం ను పునరుద్ధరించాలని తెలంగాణ 2వ ముఖ్యమంత్రి గా పదవీ ప్రమాణ స్వీకారం చేయనున్న అనుముల రేవంత్ రెడ్డి ని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ టీచర్స్ ఎంప్లాయిస్ తెలంగాణ స్టేట్ (సీ పీ ఎస్ టీ ఈ ఎ టీ ఎస్) ఓ ప్రకటన లో కోరింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాచన రఘునందన్ సోమవారం నాడు విడుదల చేసిన ఓ ప్రకటన లో..దేశ వ్యాప్తంగా ఎందరో ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణులు కొన్నాళ్ళ నుంచి ఆయా రాజకీయ పార్టీల కు,సిపిఎస్ ను రద్దు చేయండి మహా ప్రభో అని మొర పెట్టుకున్నప్పటికి.. తమ కంఠ శోష అరణ్య రోదన గా నే మిగిలి పోయిందన్నారు.అంచేత కనీసం కాంగ్రెస్ పార్టీ ఐనా తాము ఏళ్లు గా ఎదురు చూస్తున్న “సిపిఎస్ రద్దు” కోసం నిర్ణయం తీసుకుంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

ఎన్నికలకు ముందు కూడా ..తాము అధికారం లోకి వస్తె సిపిఎస్ రద్దు చేస్తాం అని హామీ ఇచ్చిన విషయాన్ని మాచన రఘునందన్ కాంగ్రెస్ పార్టీకి,ఆ పార్టీ నేతల కు గుర్తు చేశారు.దేశవ్యాప్తంగా కోటి మంది కి పైగా నూతన పెన్షన్ విధానం లో ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగ శ్రేణులు ఉన్నారని రఘునందన్ వివరించారు.ఉద్యోగుల పాలిట “టెన్షన్” స్కీమ్ గా పరిణమించిన సీ పీ ఎస్ పథకం ను రద్దు చేయాలని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నే గాక యావత్ భారత వ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు.ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ అక్కడ న్యూ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసిన సంగతి కాంగ్రెస్ కు తెలుసు నన్నారు. ఇక్కడ తెలంగాణ లో కూడా మార్పు కోసం ఓటు వేసిన ప్రజల్లో ఉద్యోగుల కూడా ఉన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర లేదన్నారు.ఇచ్చిన హామి నిలబెట్టుకుని మొట్ట మొదటి సంతకం సిపిఎస్ రద్దు దస్త్రం పై చేయాలని,తద్వారా చరిత్ర లో నిలిచి పోయే నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి పేరు దేశం లో మారుమోగాలని మాచన రఘునందన్ ఆకాక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News