Friday, December 20, 2024

జిహెచ్‌ఎంసిలో 31 వేలకు పైగా నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్ల రద్దు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్రమంగా జరీచేసిన వేలాది జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జిహెచ్‌ఎంసి) ఇటీవల రద్దు చేసింది. మెహదీపట్నం, చార్మినార్, ఫలక్‌నుమా, బేగంపేట, సికింద్రాబాద్, మలక్‌పేట, ముషీరాబాద్, గోషామహల్ తదితర సర్కిళ్లలో ఇటువంటి నకిలీ సర్టిఫికెట్లు ఈస్థాయిలో జారీఅయినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ అక్రమాలకు మీ సేవా సెంటర్లే కారణమని జిహెచ్‌ఎంసి అధికారులు ఆరోపిస్తుండగా రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్(ఆర్‌డిఓ) ధ్రువీకరణ లేకుండా ఈ సర్టిఫికెట్లు పెద్ద ఎత్తున జారీఅయినట్లు తెలుస్తోంది. 2022 మార్చి, డిసెంబర్ మధ్య 7,000కు పైగా బర్త్ సర్టిఫికెట్లు, 4,000కు పైగా డెత్ సర్టిఫికెట్లు జారీ అయినట్లు తెలుస్తోంది.

ఆధార్ కార్డు, పాస్‌పోర్టు, పాన్ కార్డు, రేషన్ కార్డు తదితర సర్టిఫికెట్లు పొందేందుకు బర్త్ సర్టిఫికెట్లు తప్పనిసరి. అదే విధంగా ఇన్సూరెన్సు, ఆస్తి బదిలీ తదితర అవసరాల కోసం డెత్ సర్టిఫికెట్లు అవసరమవుతాయి. సాధారణంగా బర్త్, డెత్ సర్టిఫికెట్ల కోసం కొంతమంది ప్రజలు బ్రోకర్లను సంప్రదించి రూ. 2,500 నుంచి రూ. 3,000 వరకు చెల్లిస్తారు. ఈ బ్రోకర్లు అక్రమ మార్గంలో వీటిని సంపాదిస్తారు.

కాగా.. జిహెచ్‌ఎంసికి చెందిన మెహదీపట్నం సర్కిల్‌లో అత్యధికంగా నకిలీ సర్టిఫికెట్లు జారీ అయినుట్ల తెలుస్తోంది. 5,877 బర్త్ సర్టిఫికెట్లు, 240 డెత్ సర్టిఫికెట్లు నకిలీవని తేలింది. ఇక చార్మినార్ సర్కిల్‌లో 3949 బర్త్ సర్టిఫికెట్లు, 249 డెత్ సర్టిఫికెట్లు నకిలీవిగా తేలాయి. ఫలక్‌నుమా సర్కిల్‌లో 1839 బర్త్ సర్టిఫికెట్లు, 220 డెత్ సర్టిఫికెట్లు, బేగంపేట సర్కిల్‌లో 2,821 బర్త్ సర్టిఫికెట్లు, 409 డెత్ సర్టిఫికెట్లు, సికింద్రాబాద్ సర్కిల్ 1,758 బర్త్ సర్టిఫికెట్లు, 204 డెత్ సర్టిఫికెట్లు నకిలీవని తేలినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News