Tuesday, November 5, 2024

విద్యాశాఖలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు రద్దు

- Advertisement -
- Advertisement -

Cancellation of fixed deposits in Department of Education

సేవింగ్ ఖాతాలోకి నిధుల బదలాయింపు
తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారం
నేపథ్యంలో విద్యాశాఖ ముందు జాగ్రత్త చర్యలు

మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారం నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. మరో విభాగంలో ఇలాంటి ఉదంతాలకు అవకాశం కల్పించకుండా ముందస్తు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా తెలుగు అకాడమీ సహా విద్యాశాఖ పరిధిలోని వివిధ భాగాలలో ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లను రద్దు చేసుకుని, సాధారణ సేవింగ్ అకౌంట్‌లోకి నిధులు బదలాయిస్తున్నారు. అలాగే తెలుగు అకాడమీ నిధుల విషయంలోనూ ఇప్పటికే బ్యాంకు ఉన్నతాధికారులతో విద్యాశాఖ అధికారులు సంప్రదింపులు జరిపారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) నిబంధనల ప్రకారం తమకు బ్యాంకు అధికారులతో సంబంధం లేదని, ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో ఉన్న నిధులకు బ్యాంకులే పూర్తి బాధ్యత వహించి నిధులు తిరిగి ఇవ్వాలని బ్యాంకు అధికారులతో చర్చలు జరుపగా, అందుకు బ్యాంకు అధికారులు అంగీకరించినట్లు తెలిసింది.

తెలుగు అకాడమీ నిధులు గోల్‌మాల్ వ్యవహారంలో పోలీసులతు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేయగా, ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. దాంతోపాటు ఇద్దరు నిపుణులైన ఆడిటర్లతో తెలుగు అకాడమీకి చెందిన లావాదేవీలపై సమగ్రంగా పరిశీలించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలిసింది. అయితే తెలుగు అకాడమీ నిధుల గోల్‌మాల్ వ్యవహారంలో ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అకాడమీ సహా విద్యాశాఖ పరిధిలోని అన్ని విభాగాలలో ఫిక్స్‌డ్ డిపాజిట్లను రద్దు చేసుకుని, ఆ నిధులను సేవింగ్ ఖాతాలోకి మార్చుకోవాలని విద్యాశాఖ నిర్ణయించినట్లు తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News