కేరళ హైకోర్టు సంచలన తీర్పు
తిరువనంతపురం : ఓ అత్యాచారం కేసులో కేరళ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. దోషికి విధించిన జీవితఖైదును కేరళ హైకోర్టు రద్దు చేసింది. మహిళ అంగీకారం తోనే అత్యాచారం చేశాడని, ఆపై బాధితురాలిని దోషి పెళ్లి చేసుకున్నందుకు కింది కోర్టు విధించిన జీవిత ఖైదును హైకోర్టు కొట్టివేసింది. దీంతో వండిపెరియార్‌కు చెందిన దోషి జైలు నుంచి విడుదలయ్యాడు. నిందితుడు, ఫిర్యాదు చేసిన బాధిత మహిళకు పదేళ్లుగా సంబంధం ఉందని, వారు మూడుసార్లు లైంగిక సంబంధం పెట్టుకున్నారని దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో దోషి బాధితురాలైన ఫిర్యాదుదారునే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. కానీ చివరికి కుటుంబ సభ్యుల ఒత్తిడికి తలొగ్గి మరో పెళ్లి చేసుకున్నాడు. వరకట్నం లేకుండా బాధితురాలిని పెళ్లి చేసుకోవడం నిందితుడి కుటుంబానికి ఇష్టం లేదని కోర్టు పేర్కొంది. ఈ సంచలన తీర్పును జస్టిస్ ముహమ్మద్ ముస్తాక్, కౌసర్ ఎడప్పగత్‌లతో కూడిన ధర్మాసనం వెలువరించింది. నిందితుడు వాస్తవాలను దాచడం వల్ల వారి మధ్య లైంగిక చర్య జరిగిందని నిరూపించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని కోర్టు పేర్కొంది. ఈ కేసుకు దారి తీసిన సంఘటనను నమ్మక ద్రోహంగా పరిగణించవచ్చును కానీ వివాహానికి హామీ ఇచ్చే అత్యాచారం కాదని కోర్టు పేర్కొంది.