Friday, December 20, 2024

జంట నగరాల్లో ఎంఎంటిఎస్ రైళ్ల రద్దు

- Advertisement -
- Advertisement -

ఇతర ప్రాంతాల్లో పలు రైళ్లు దారిమళ్లింపు

హైదరాబాద్ : జంట నగరాల్లో తిరిగే 22 ఎంఎంటిఎస్ రైలు సర్వీసులను వారం రోజుల పాటు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్యరైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. రైలు ట్రాకుల మరమ్మతులు, నిర్వహణ పనుల కారణంగా ఈనిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. జూలై 31 నుంచి ఆగస్టు 6 వరకు రైళ్ల సర్వీసులు రద్దవుతున్నట్లు పేర్కొంది. రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.. లింగంపల్లి- హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే 12 ఎంఎంటిఎస్ రైలు సర్వీసులు.. ఉందానగర్ -లింగంపల్లి, ఫలక్‌నుమా -లింగంపల్లి మధ్య రాకపోకలు సాగిస్తుండగా వీటిలో 10 ఎంఎంటిఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండింటినీ దారిమళ్లించనున్నారు.

కాగా ఈ నెల 31 నుండి వచ్చే నెల 6వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు, దారిమళ్లింపు చేశామని వాటి వివరాలు ఇలా ఉంటాయని తెలిపింది. రద్దయిన రైళ్లలో కాచిగూడ -నిజామాబాద్ రైలు , నిజామాబాద్ -కాచీగూడ రైలు ఉందని వెల్లడించింది. ఇక పాక్షికంగా రద్దయిన రైళ్లలో ముద్‌ఖేడ్ -నిజామాబాద్ రైలు (దావుండ్ నిజామాబాద్ ) మధ్యన , అలాగే నిజామాబాద్ -ముద్ఖేడ్ రైలు ( నిజామాబాద్ పండరీపురం ) మధ్యన పాక్షికంగా రద్దు చేశారు. కాగా కర్నూల్ టౌన్- సికింద్రాబాద్ రైలును ఒకటోతేదీన రీ షెడ్యూల్ చేస్తూ సమయాన్ని కాస్త ఓ 90 నిమిషాలు ముందుకు మార్చడంతో సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరనుంది. అలాగే గుంతకల్ బోధన్ రైలు ఆగస్టు 2వ,3వ,6వ తేదీల్లో మరో రెండు గంటలు ముందుకు మార్చడంతో రీషెడ్యూల్ ప్రకారం ఉదయం 8.00 గంటలకు బయలుదేరనుంది. కాగా ఈ నెల 30, 31, వచ్చే నెల 1వ తేదీలకు గాను 14 రైళ్లను రద్దు చేశారు. రద్దయిన వీటిలో రాజమండ్రి -విశాఖపట్నం ( 6వ తేదీ వరకు ), విశాఖపట్నం -రాజమండ్రి (6వ తేదీ వరకు), విజయవాడ- విశాఖపట్నం (6వ తేదీ వరకు ), విజయవాడ- గూడూర్ ( 6వ తేదీ వరకు ), విజయవాడ- బిట్రగుంట ( 5వ తేదీ వరకు), బిట్రగుంట- విజయవాడ (6వ తేదీ వరకు ) ఉన్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News