ముంబై: బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారన్న కేసులో ముంబై మాజీ పోలీసు కమిషనర్ పరమ్ బీర్ సింగ్‌పై జారీచేసిన ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను మెజిస్ట్రేట్ కోర్టు గురువారం రద్దు చేసింది. పరమ్ బీర్ సింగ్ పరారీలో ఉన్నట్లు నవంబర్ 17న జారీ చేసిన ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను ముంబైలోని అదనపు చీఫ్ మెట్రోపాలిట్ మెజిస్ట్రేట్ ఎస్‌బి భాజీపలే గురువారం రద్దు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. గత వారం పరమ్ బీర్ సింగ్ కోర్టులో హాజరుకావడంతో గతంలో జారీచేసిన ప్రొక్లమేషన్ ఆర్డర్‌ను రద్దు చేయాలని కోరుతూ ఆయన తరఫు న్యాయవాది గత వారం కోర్టులో అప్లికేషన్ దాఖలు చేశారు. సిఆర్‌పిసికి చెందిన సెక్షన్ 82 ప్రకారం నిందితుడిని కోర్టులో హాజరుపరచాలని వారెంట్ జారీచేసిన తర్వాత అది అమలు కాని పక్షంలో కోర్టు ప్రొక్లమేషన్ ఆర్డర్ జారీచేసే అవకాశం ఉంటుంది. అంతేగాక సెక్షన్ 83 ప్రకారం నిందితుడికి సంబంధించిన ఆస్తులను కోర్టు జప్తు చేసే అధికారం కూడా ఉంటుంది.
పరమ్ బీర్ సింగ్‌పై ప్రొక్లమేషన్ ఆర్డర్ రద్దు
- Advertisement -
- Advertisement -
- Advertisement -