Monday, December 23, 2024

పలు రైళ్ల రద్దు… పలు రైళ్లు దారి మళ్లీంపు

- Advertisement -
- Advertisement -

Cancellation of several trains: South Central Railway

 

హైదరాబాద్: సెంట్రల్ రైల్వే నాగపూర్ డివిజన్‌లో నాన్- ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఈ నెల 29, 30 తేదీల్లో సికింద్రాబాద్- టు రాయ్‌పూర్-రైలు (12771), రాయ్‌పూర్ టు -సికింద్రాబాద్ (12772) రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. వీటితోపాటు జమ్మికుంట టు -ఉప్పల్ రైల్వేస్టేషన్ మధ్య 3వ లైన్ పనులు జరుగుతుండడంతో భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్, సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్‌ప్రెస్, రామగిరి ప్యాసింజర్, సింగరేణి ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. జూలై 20 వ తేదీ వరకు ఈ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా మరో 12 రైళ్లకు సంబంధించి రాకపోకలను మళ్లీంచినట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News