Monday, January 20, 2025

విజయవాడ డివిజన్ పరిధిలో కొన్ని రైళ్ల రద్దు, మరికొన్ని రైళ్ల దారి మళ్లింపు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్:  దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో రైలు పట్టాల మరమ్మతుల నిమిత్తం పలు రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లీంచారు. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు పనుల కారణంగా ఈనెల 13వ తేదీనుంచి పలు రైళ్లను రద్దు చేశారు. ఈనెల 13 వ తేదీ నుంచి 17వ తేదీ వరకు బిట్రగుంట – చెన్నై సెంట్రల్ రైలును కూడా అధికారులు రద్దు చేశారు. అలాగే విజయవాడ-  విశాఖపట్నం, విశాఖపట్నం నుంచి విజయవాడ రైలును 13,14,15,17,18 తేదీల్లో రద్దు చేశారు.

ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 19వ తేదీ వరకు కాకినాడ పోర్టు –  విశాఖపట్నం, రాజమండ్రి- విశాఖపట్నం, మచిలీపట్నం – విశాఖపట్నం, గుంటూరు  – రాయగడ, గుంటూరు  -విశాఖపట్నం, విజయవాడ-  తెనాలి, విజయవాడ-  ఒంగోలు, విజయవాడ  -గూడూరు రైళ్లను రద్దు చేశారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు విశాఖపట్నం – మచిలీపట్నం, రాయగడ, గుంటూరు, గూడూరు – విజయవాడ రైళ్లను రద్దు చేశారు. ఈనెల 19వ తేదీ వరకు రామవరప్పాడు మీదుగా వెళ్లే పలు రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News