Monday, December 23, 2024

సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు..

- Advertisement -
- Advertisement -

హైద‌రాబాద్ : సోమేశ్ కుమార్ తెలంగాణ క్యాడర్ కేటాయింపు రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ‌లో సోమేశ్ కుమార్ కొన‌సాగింపును ర‌ద్దు చేస్తూ హైకోర్టు సీజే జ‌స్టిస్ ఉజ్జ‌ల్ భూయాన్ బెంచ్ తీర్పు వెల్ల‌డించింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు వెళ్లాల‌ని సోమేశ్ కుమార్‌ను కోర్టు ఆదేశించింది. కాగా.. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో సోమేశ్ కుమార్‌ను కేంద్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి కేటాయించింది. దీంతో సోమేశ్ కుమార్ క్యాట్‌ ను ఆశ్ర‌యించారు.

ఈ క్ర‌మంలో కేంద్రం ఉత్త‌ర్వులు నిలిపివేసి తెలంగాణ‌లో కొన‌సాగేలా క్యాట్ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇక క్యాట్ మ‌ధ్యంత‌ర ఉత్వ‌ర్వుల‌తో సోమేశ్ కుమార్ తెలంగాణ‌లో కొన‌సాగుతున్నారు. ఈ క్ర‌మంలో క్యాట్ ఉత్త‌ర్వులు కొట్టేయాల‌ని 2017లో కేంద్రం హైకోర్టును ఆశ్ర‌యించింది. క్యాట్ మ‌ధ్యంత‌ర‌ ఉత్త‌ర్వుల‌ను కొట్టివేస్తూ హైకోర్టు సీజే ధ‌ర్మాస‌నం మంగ‌ళ‌వారం తీర్పు వెల్ల‌డించింది. సోమేష్ కుమార్ న్యాయవాది అభ్యర్థన మేరకు తీర్పు అమలు 3 వారాలు నిలిపివేసింది కోర్టు. 2019, డిసెంబ‌ర్ నుంచి తెలంగాణ సీఎస్‌గా సోమేశ్ కుమార్ కొన‌సాగుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News