Wednesday, January 22, 2025

బ్యూటీషియన్లకు క్యాన్సర్ రిస్క్

- Advertisement -
- Advertisement -

అందరినీ అందంగా తీర్చి దిద్దే బ్యూటీషియన్లు, హెయిర్ డ్రెస్సర్లు తమకు తెలియకుండానే అండాశయ క్యాన్సర్ బాధితులవుతున్నట్టు కెనడా లోని మాంట్రియల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తల అధ్యయనం వెల్లడించింది. సేల్స్, రిటైల్, నిర్మాణ రంగ పరిశ్రమల్లో పనిచేసే వారికి కూడా ఇలాంటి ముప్పు సంభవించే అవకాశం ఉందని వెల్లడైంది. అందాన్ని తీర్చి దిద్దడానికి ఉపయోగించే కొన్ని పదార్థాల వల్ల క్యాన్సర్ వస్తోందని తెలుస్తోంది. 29 రకాల రసాయనాల తాకిడికి గురికావడానికి అండాశయ క్యాన్సర్ ముప్పుకు ఉన్న సంబంధాన్ని ఈ పరిశోధనలో విశ్లేషించారు. 1879 ఏళ్ల మధ్య ఉన్న మొత్తం 1388 మంది మహిళలపై శాస్త్రవేత్తలు అధ్యయనం సాగించారు.

వీరిలో 491 మందికి అండాశయ క్యాన్సర్ ఉన్నట్టు తేలింది. పదేళ్లకు పైగా హెయిర్ డ్రెస్సర్లు, బ్యూటీషియన్లుగా పనిచేసిన మహిళలకు అండాశయ క్యాన్సర్ ముప్పు మూడు రెట్లు ఎక్కువని , 13 రకాల రసాయనాలు ఈ ముప్పును మరింత సన్నిహితం చేస్తున్నాయని శాస్త్రవేత్తల అధ్యయనంలో నిర్ధారణ అయింది. ఇదే విధంగా వస్త్రరంగంలో సుదీర్ఘకాలం పనిచేసేవారికి ఈ వ్యాది వచ్చే ప్రమాదం 85 శాతం వరకు ఉండగా, సేల్స్ రంగం లోని వారికి 45 శాతం వరకు , రిటైల్ రంగం లోని వారికి 59 శాతం వరకు ఈ ముప్పు ఉందని అధ్యయనంలో వెల్లడైంది. టాల్కమ్ పౌడర్, అమ్మోనియా, హైడ్రొజన్ పెరాక్సైడ్, హెయిర్ డస్ట్, సింథటిక్ ఫైబర్స్, డైస్, కలర్స్, సెల్యులోజ్, ఫార్మాల్డిహైడ్, ప్రొపెల్లంట్ గ్యాస్, బ్లీచ్‌ల్లో ఉండే రసాయనాల ఫలితంగా ఎనిమిదేళ్లకు పైగా ఈ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు అండాశయ క్యాన్సర్ ప్రమాదం 40 శాతం వరకు ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News