Wednesday, January 22, 2025

‘అందరికీ’ క్యాన్సర్ స్క్రీనింగ్

- Advertisement -
- Advertisement -

Cancer screening test for everyone over age of 40 in Telangana

రాష్ట్రంలోని 40ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు

పేదలకు మెరుగైన వైద్యమే ప్రభుత్వ లక్షం
ఏటా 15వేల మంది క్యాన్సర్ రోగులకు ఉచిత వైద్యం
ఆరోగ్యశ్రీ కింద ఏటా రూ.100కోట్లు వ్యయం
రాష్ట్రంలోని క్యాన్సర్ కేసుల్లో 22శాతం నోటి క్యాన్సర్లే : హైదరాబాద్ నగరంలోని ఎంఎన్‌జెలో రూ.7కోట్ల 16లక్షలతో సమకూర్చిన ఆధునాతన సీటీ స్కాన్ ప్రారంభిస్తూ మంత్రి హరీశ్‌రావు

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు 50 శాతం పెరిగాయని రాష్ట్రంలో వెలుగు చూస్తున్న క్యాన్సర్ కేసుల్లో దాదాపు 22 శాతం నోటి క్యాన్సర్లేనని మంత్రి తెలిపారు. ప్రపంచ కేన్సర్ డే సందర్భంగా శుక్రవారం నాడు నగరంలోని ఎంఎన్ జె కేన్సర్ హాస్పిటల్ లో సిటిస్కాన్, డెంటల్ ఎక్స్ రే వొపిజి, పేషెంట్స్ అటెండెంట్ భవనంతో పాటు మొబైల్ స్క్రీనింగ్ వాహనాన్ని మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లలో దేశవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు సుమారు 50 శాతం పెరిగాయని, ఆహరం, జీవన విధానంలో మార్పులు, ధూమపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండటం ద్వారా కొంతవరకు క్యాన్సర్ రాకుండా జాగ్రత్తపడొచ్చని సూచించారు. రాష్ట్రంలో కేన్సర్ చికిత్సకు ఆరోగ్యశ్రీ పధకం ప్రభుత్వం ఏడాదికి 100కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగంలో పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. ఆరోగ్య కింద క్యాన్సర్ చికిత్సకు ప్రభుత్వం ప్రతి ఏడాదిరూ. 100 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.

నిమ్స్, ఎంఎన్‌జె ఆస్పత్రుల్లో క్యాన్సర్ రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తున్నామని తెలిపారు. ఏడాదికి 15 వేల మంది క్యాన్సర్ రోగులకు ప్రభుత్వం ఉచితంగా వైద్య సేవలు అందిస్తోందని అని హరీశ్‌రావు స్పష్టం చేశారు. 14 సంవత్సరాల క్రితం ఏర్పాటైన సీటీ స్కాన్ పని చేయడం లేదని చెప్పడంతో రూ. 7 కోట్ల 16 లక్షలతో అధునాతన సీటీ స్కాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. క్యాన్సర్ రోగులను గుర్తించేందుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో రూ. కోటితో అందుబాటులోకి తీసుకొచ్చిన మొబైల్ స్క్రీనింగ్ వాహనాన్ని ప్రారంభించామన్నారు. సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్‌ను గుర్తించేందుకు ఈ వాహనం ఉపయోగపడుతుందన్నారు. నీనారావు చారిటబుల్ ట్రస్టు ద్వారా డాక్టర్ గోవింద్ రావు రూ. 3 కోట్లతో 300 పడకల పేషెంట్ అటెండెన్సీ భవనాన్ని నిర్మించారు. ఇక్కడ రూ. 5 భోజన సౌకర్యం కల్పిస్తామని మంత్రి తెలిపారు. రూ. 40 లక్షలతో డెంటల్ ఎక్స్‌రే వొపిజిని ప్రారంభం చేసుకున్నామని తెలిపారు.

ఇహెచ్‌ఎస్, సింగరేణి, ఆర్‌టిసి ఉద్యోగులతో పాటు ఇతర ఉద్యోగుల అవసరాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ. 3 కోట్లతో నిర్మించిన 24 గదుల స్పెషల్ బ్లాక్‌ను ప్రారంభించామని మంత్రి తెలిపారు.కాగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంఎన్‌జె క్యాన్సర్ బడ్జెట్‌ను సిఎం కెసిఆర్ రెట్టింపు చేశారని హరీశ్‌రావు గుర్తు చేశారు. ఈ ఆస్పత్రికి 252 పోస్టులను కొత్తగా మంజూరు చేశారు. 32 మంది డాక్టర్లు 85 మంది స్టాఫ్‌నర్సులు, 85 మంది టెక్నిషీయన్లను మంజూరు చేశామని చెప్పారు. రోగులు పెరుగుతున్న నేపథ్యంలో అరబిందో ఫార్మా వారు సిఎస్‌ఆర్ ప్రోగ్రాం కింద రూ. 65 కోట్లతో 300 పడకలతో కొత్తగా ఆస్పత్రిని నిర్మిస్తున్నారు. ఇది ఏప్రిల్ నెలలోగా అందుబాటులోకి రానుందని అన్నారు. ప్రస్తుతమున్న 450 బెడ్స్‌కు అదనంగా ఈ 300 బెడ్స్ వస్తే 750 పడకలకు అప్‌గ్రేడ్ చేసుకోబోతామని మంత్రి తెలిపారు. ఎంఎన్‌జేకు సమీపంలోని రెండు, మూడు ఎకరాల స్థలాన్ని కూడా క్యాన్సర్ హాస్పిటల్‌కు అందించాలని కోరారు. ఆ స్థలాన్ని ఎంఎన్‌జె ఆస్పత్రికి కేటాయిస్తామని మంత్రి తెలిపారు.ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News