Sunday, January 19, 2025

లక్షణాలకు ముందే 50 రకాల క్యాన్సర్ల గుర్తింపు

- Advertisement -
- Advertisement -

ప్రపంచం లోనే తొలిసారిగా క్యాన్సర్ లక్షణాలు కనిపించక ముందే 50 రకాల క్యాన్సర్లను గుర్తించ గలిగే వేగవంతమైన, సరళమైన గ్యాలరీ రక్తపరీక్షకు బ్రిటన్ నేషనల్ హెల్త్ సర్వీస్ శ్రీకారం చుట్టింది. బ్రిటన్ ఆరోగ్య సంరక్షణ సంస్థ గ్రెయిల్ ఈమేరకు ట్రయల్స్ సాగించింది. క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను గ్యాలరీ పరిశీలిస్తుంది. ఈ ప్రక్రియ ఎంతవరకు పనిచేస్తుందో పరీక్షించడానికి ఇంగ్లాండ్ లోని ఎనిమిది ప్రాంతాల్లో 1,40,000 మంది వాలంటీర్లను నియమించి పరిశీలించారు. క్యాన్సర్ రకాలను గుర్తించడమే కాకుండా, శరీరంలో అధిక స్థాయిలో క్యాన్సర్ ఎక్కడ ఉందో కచ్చితంగా ఈ పరీక్ష అంచనా వేస్తుందని , ప్రాణాంతక క్యాన్సర్లను గుర్తించడంలో ఈ పరీక్ష చాలా బలంగా ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ పరీక్ష విజయవంతమైతే క్యాన్సర్ గుర్తింపు, వైద్య చికిత్సలో ఒక విప్లవానికి నాంది పలుకుతుందని భావిస్తున్నారు.

తల, మెడ, ప్రేగులు, ఊపిరితిత్తులు, క్లోమ, గొంతు క్యాన్సర్ వంటి వాటిని ప్రారంభంలో గుర్తించడం చాలా కష్టం. అయితే ఈ ప్రక్రియ ద్వారా సులువుగా చికిత్స చేయవచ్చునని పరిశోధకులు వివరిస్తున్నారు. ఈ ట్రయల్స్ ఫలితాలు ఈ ఏడాది లో వెలువడుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ట్రయల్స్ విజయవంతమైతే 202425నాటికి ఇంగ్లాండ్‌లో మరో మిలియన్ మందికి విస్తరించాలని నేషనల్ హెల్త్ సర్వీస్ యోచిస్తోంది. గత మూడేళ్లలో క్యాన్సర్ నిర్ధారణ చేయని అభ్యర్థులను స్థానికంగా ఉండే మొబైల్ క్లినిక్‌లో వారి రక్తనమూనాలను సేకరించి , మళ్లీ 12 నెలల తరువాత మరోసారి పరీక్షలకు పిలుస్తారు. రెండేళ్ల కోసారి వీరి నుంచి మరోసారి నమూనాలు సేకరించి పరీక్షిస్తారు. ఈ గ్యాలరీ టెస్టును యుకె క్యాన్సర్ రీసెర్చి, కింగ్స్ కాలేజీ లండన్ క్యాన్సర్ ప్రివెన్షన్ ట్రయల్స్ యూనిట్, ఎన్‌హెచ్‌ఎస్ హెల్త్‌కేర్‌కంపెనీ గ్రెయిల్ భాగస్వామ్యంతో నేషనల్ హెల్త్ సర్వీస్ అభివృద్ధి చేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News