Saturday, April 5, 2025

ఐదారు నెలల్లో మహిళలకు అందుబాటులో క్యాన్సర్ వ్యాక్సిన్

- Advertisement -
- Advertisement -

మహిళలను తీవ్రంగా పీడిస్తున్న క్యాన్సర్లను ఎదుర్కోడానికి ఐదారు నెలల్లో వ్యాక్సిన్ అందుబాటు లోకి వస్తుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్ రావ్ జాదవ్ మంగళవారం వెల్లడించారు. పాత్రికేయుల సమావేశంలోఆయన మాట్లాడుతూ ఈ టీకాపై పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చాయని, ట్రయల్స్ కొనసాగుతున్నాయని తెలిపారు. “ దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్రం అనేక చర్యలు తీసుకుంటోంది. 30 ఏళ్లు పైబడిన మహిళలకు ఆస్పత్రుల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. ఈ వ్యాధిని ముందస్తుగా గుర్తించేందుకు డేకేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.

క్యాన్సర్ చికిత్సకు వినియోగించే ఔషధాలపై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేశాం. అందుబాటులో రాబోయే ఈ వ్యాక్సిన్ రొమ్ము, నోటి, గర్భాశయ, క్యాన్సర్లని నియంత్రిస్తుంది ” అని తెలిపారు. క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే మందులపై కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం రద్దు చేసిందని గుర్తు చేశారు. ఈ వ్యాక్సిన్‌కు 9 నుంచి 16 ఏళ్ల లోపు బాలికలు అర్హులని చెప్పారు. ప్రస్తుత హెల్త్‌కేర్‌సెంటర్లను ఆయుష్ సౌకర్యాలకు అనువుగా మార్చరా అన్న ప్రశ్నకు ఆస్పత్రుల్లో ఆయుష్ విభాగాలు ఉన్నాయని, ప్రజలు వాటిని వినియోగించుకోవచ్చని చెప్పారు. అలాంటి ఆరోగ్యవసతులతో దేశంలో 12,500 కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. ఈ సంఖ్యను ప్రభుత్వం పెంచుతుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News