Sunday, January 19, 2025

ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉచితంగా ఆర్టీసి బస్సుల్లో ప్రయాణించవచ్చు

- Advertisement -
- Advertisement -

Candidates appearing for the Prelims exam can travel for free

మనతెలంగాణ/హైదరాబాద్ : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్‌కు సంబంధించి ఈనెల 6వ తేదీన ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు తెలంగాణ ఆర్టీసి శుభవార్త చెప్పింది. ఆ పరీక్షకు హాజరయ్యే వారికి ఉచితంగా రవాణా సదుపాయం కలిగించనున్నట్లు పేర్కొంది. అభ్యర్థులు హాల్ టికెట్లు చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చని ఎండి సజ్జనార్ తెలిపారు. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు వరంగల్ ట్రై సిటీల్లోని అన్ని రకాల సిటీలు మెట్రో, ఏసి బస్సుల్లోనూ అభ్యర్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఆర్టీసి తరఫున ఎండి సజ్జనార్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News