Tuesday, November 5, 2024

ప్రజలు పేదలు.. పాలకులు సంపన్నులు

- Advertisement -
- Advertisement -

(హరి మోహన్/మన తెలంగాణ)
వలసల జిల్లా కోటీశ్వరుల ఖిల్లా? అంటే అవుననే అంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా అంటేనే పేదరికం, వలసలు. అయితే ఇక్కడ ప్రజ లు మాత్రమే పేదలు కానీ నేతలు కాదన్నది జగమెరిగిన సత్యం. ఓ రకంగా అక్షర సత్యమేనని చెప్పవచ్చు. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పోటీ చేస్తున్న చాలా మంది అభ్యర్థులు కోటీశ్వరులే కావడం గమనార్హం. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న అభ్యర్థుల్లో మర్రి జనార్థన్‌రెడ్డి అత్యం త సంపన్నుడు. ఆయా నియోజకవర్గాల్లో బిఆర్‌ఎస్‌తో సహా కాంగ్రెస్, బిజెపి అభ్యర్థులు తమ తమ ఎన్నికల అఫిడవిట్‌లే ఇందుకు నిదర్శనంగా పేర్కొనవచ్చు.

అభ్యర్థి : అనిరుధ్‌రెడ్డి
పార్టీ : కాంగ్రెస్
నియోజకవర్గం : జడ్చర్ల
స్థిర, చరాస్తులు : రూ. 47.45 కోట్లు
ఇక జడ్చర్ల నియోజకవర్గంలో పోటీ చేస్తున్న మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులంతా కోటీశ్వరులే కావడం విశేషం. కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి, ఆయన భార్య మంజుష పేరు మీద రూ. 47.45 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయి.

అభ్యర్థి : డా.లక్ష్మారెడ్డి
పార్టీ : బీఆర్‌ఎస్
నియోజకవర్గం : జడ్చర్ల
స్థిర, చరాస్తులు : రూ. 32.87 కోట్లు
రుణాలు : రూ.15.12 కోట్లు
జడ్చర్ల బిఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ లక్ష్మారెడ్డి, ఆయన భార్య శ్వేతకు రూ. 32.87 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. వీరి పేరు మీద రూ. 15.12 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అభ్యర్థి : జలంధర్‌రెడ్డి
పార్టీ : బీజేపీ
నియోజకవర్గం : మక్తల్
స్థిర, చరాస్తులు : రూ. 45.89 కోట్లు
రుణాలు : రూ. 8.86 కోట్లు
మక్తల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న జలంధర్‌రెడ్డి, ఆయన భార్య పద్మజ పేరు మీద రూ. 45.89 కోట్లు చర, స్థిరాస్తులు ఉండగా.. వీరి పేరు మీద రూ. 8.86 కోట్ల రుణాలు ఉన్నాయి. జలంధర్‌రెడ్డి కూడా గుత్తేదారుగా కాంట్రాక్టులు చేస్తుంటారు.

అభ్యర్థి : నిరంజన్‌రెడ్డి
పార్టీ : బీఆర్‌ఎస్
నియోజకవర్గం : వనపర్తి
స్థిర, చరాస్తులు : రూ. 7.98 కోట్లు
రుణాలు : రూ. 1.06 కోట్లు
వనపర్తి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగిన బిఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కూడా కోటీశ్వరులే. మంత్రి, బిఆర్‌ఎస్ అభ్యర్థి నిరంజన్‌రెడ్డి, ఆయన భార్య వాసంతి పేరు మీద రూ.7.98 కోట్ల స్థిర, చరాస్తులు ఉండగా.. మంత్రి పేరు మీద రూ. 1.06 కోట్ల రుణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అభ్యర్థి : మేఘారెడ్డి
పార్టీ : కాంగ్రెస్
నియోజకవర్గం : వనపర్తి
స్థిర, చరాస్తులు : రూ. 18.15 కోట్లు
రుణాలు : 3.40 కోట్లు
ఇక.. మంత్రి నిరంజన్‌రెడ్డిపై పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి మేఘారెడ్డి, ఆయన భార్య శారద పేరు మీద రూ. 18.15 కోట్ల చర, స్థిరాస్తులు ఉండగా.. వీరి పేరు మీద రూ. 3.40 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నట్లు తెలిపారు.

అభ్యర్థి : బీరం హర్షవర్ధన్ రెడ్డి
పార్టీ : బిఆర్‌ఎస్
నియోజకవర్గం : కొల్లాపూర్
స్థిర, చరాస్తులు : రూ. 11.82 కోట్లు
రుణాలు : రూ. 3.05 కోట్లు
కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బీరం హర్షవర్థన్‌రెడ్డి, ఆయన భార్య విజయ పేరు మీద మొత్తం రూ. 11.82 కోట్ల చర, స్థిరాస్తులు ఉన్నాయి. వీరి పేరు మీద రూ. 3.05 కోట్ల రుణాలు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

అభ్యర్థి : మర్రి జనార్దన్ రెడ్డి
పార్టీ : బిఆర్‌ఎస్
నియోజకవర్గం : నాగర్‌కర్నూల్
స్థిర, చరాస్తులు : రూ.112.23 కోట్లు
రుణాలు : రూ.26.52 కోట్లు
బిఆర్‌ఎస్ అభ్యర్థిగా నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేస్తున్న మర్రి జనార్థన్‌రెడ్డి, ఆయన భార్య జమున పేరు మీద రూ. 112.23 కోట్ల రూపాయల స్థిర, చరాస్తులు ఉన్నాయి. వస్త్ర దుకాణ వ్యాపార సంస్థలు నిర్వహిస్తున్న మర్రి జనార్థన్‌రెడ్డి, ఆయన భార్యకు మొత్తం రూ. 26.52 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు.

అభ్యర్థి : ఎస్. రాజేందర్‌రెడ్డి
పార్టీ : బిఆర్‌ఎస్
నియోజకవర్గం : నారాయణపేట
స్థిర, చరాస్తులు : రూ. 11.15 కోట్లు
రుణాలు : రూ. 10.48 కోట్లు
ఆస్తులు, ఆదాయంలో మర్రి జనార్దన్‌రెడ్డి తర్వాత రెండో స్థానంలో ఉన్నది ఎస్. రాజేందర్ రెడ్డి. ఈయన బిఆర్‌ఎస్ అభ్యర్థిగా నారాయణపేట నుంచి పోటీ చేస్తున్నారు. రాజేందర్‌రెడ్డి, ఆయన భార్య స్వాతిరెడ్డి పేరు మీద రూ. 110.15 కోట్ల స్థిర, చరాస్తులున్నా యి. రాయచూరులో విద్యా సంస్థలు నిర్వహిస్తున్న వీరికి రూ. 10.48 కోట్ల అప్పులు ఉన్నాయి.

అభ్యర్థి: ఆల వెంకటేశ్వర్ రెడ్డి
పార్టీ : బిఆర్‌ఎస్
నియోజకవర్గం : దేవరకద్ర
స్థిర, చరాస్తులు : రూ. 73.60 కోట్లు
రుణాలు : రూ 7.38 కోట్లు
దేవరకద్ర నియోజకవర్గం నుంచి బిఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఆయన భార్య మంజుల పేరు మీద మొత్తం రూ. 73.60 కోట్ల విలువగల స్థిర, చరాస్తులు ఉన్నాయి. గుత్తేదారుగా ప్రాజెక్టు పనులు చేసే వీరికి రూ. 7.38 కోట్ల రుణాలు ఉన్నాయి.

అభ్యర్థి : శ్రీనివాస్‌గౌడ్
పార్టీ : బీఆర్‌ఎస్
నియోజకవర్గం : మహబూబ్‌నగర్
స్థిర, చరాస్తులు : రూ. 23.10 కోట్లు
రుణాలు : రూ. 3.33 కోట్లు
ఇక మహబూబ్‌నగర్ బిఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆయన భార్య శారద పేరు మీద రూ. 23.10 కోట్ల విలువగల చర, స్థిరాస్తులు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీరి పేరు మీద రూ. 3.33 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నట్లు తెలిపారు.

అభ్యర్థి : కసిరెడ్డి నారాయణరెడ్డి
పార్టీ : కాంగ్రెస్
నియోజకవర్గం : కల్వకుర్తి
స్థిర, చరాస్తులు : రూ. 63.58 కోట్లు
రుణాలు : రూ.6.87 కోట్లు
ఇక కల్వకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కసిరెడ్డి నారాయణరెడ్డి, ఆయన భార్య మాధవిరెడ్డికి రూ. 63.58 కోట్ల విలువ చేసే చర, స్థిరాస్తులు ఉండగా వీరి పేరు మీద రూ. 6.87 కోట్ల బ్యాంకు రుణాలు ఉన్నాయి. కసిరెడ్డి నారాయణరెడ్డి విద్యాసంస్థలకు అధిపతిగా ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News