మన తెలంగాణ/విద్యానగర్: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఈ నెల 21 నుంచి జరగనున్న మెయిన్స్ పరీక్షలను ప్రిలిమ్స్ పరీక్షా ఫలితాలకు సంబంధించిన తప్పులను సవరించిన తరువాతనే నిర్వహించాలని నినదించారు. అశోక్ నగర్ చౌరస్తాలో బుధవారం రాత్రి ఒక్కసారిగా గ్రూప్స్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. పెద్దసంఖ్యలో నిరుద్యోగులు రోడ్ల పైకి రావడంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఈనెల 21 నుంచి జరిగే గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను వాయిదా వేయాలని అభ్యర్థులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఇప్పటికే జరిగిన పిలిమ్స్ పరీక్షల్లో వచ్చిన తప్పుల అంశంలో జీవో 29ని సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని కోరారు. దీంతో అశోక్ నగర్ లో పరిస్థితి కొద్దిసేపు ఉద్రిక్తంగా మారింది. భారీగా మోహరించిన పోలీసులు అభ్యర్థుల నిరసనలను కట్టడి చేసి వాహనాల రాకపోకలకు ఆటంకం లేకుండా చూశారు.వివిధ హాస్టళ్ల నుంచి ఒక్కసారిగా అభ్యర్థులు రావడంతో అంతర్గత దారులు సైతం కిక్కిరిసిపోయాయి.
అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల మెరుపు నిరసన,అరెస్టు
- Advertisement -
- Advertisement -
- Advertisement -