Monday, December 23, 2024

గ్రూప్ 4 పరీక్షకు అభ్యర్థులు సకాలంలో హాజరుకావాలి

- Advertisement -
- Advertisement -

పెద్దపల్లి: జిల్లాలో గ్రూప్ 4 పరీక్షలు రాసే అభ్యర్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు రావాలని జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు. ఉదయం పరీక్ష కేంద్రాలకు అరగంట ముందే చేరుకోవాలని జూలై 1న ఉదయం 8 నుంచి 9.45 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 1 నుంచి 2.15 గంటల వరకు పరీక్ష సెంటర్‌లోకి అనుమతి ఉంటుందన్నారు.

అభ్యర్థులు తమ వెంట ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావద్దని సూచించారు. ఒరిజినల్ హాల్ టికెట్‌తోపాటు గుర్తింపు కార్డు వెంట తెచ్చకోవాలన్నారు. జిల్లాలో 43 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేసి అభ్యర్థులను పరీక్ష హాల్‌లోకి పంపించాలన్నారు. అభ్యర్థులకు అన్ని రకాల సదుపాయాలను కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.

అభ్యర్థులు హాల్ టికెట్‌పై ఫోటో, సంతకం చెక్ చేసుకోవాలని, హాల్ టికెట్‌పై ఫోటో సరిగా లేకపోతే గెజిటెడ్ అధికారి దృవీకరించిన పాస్ పోర్ట్ సైజ్ మూడు ఫోటోలు తీసుకొని రావాలని, లేని పక్షంలో పరీక్షకు హాజరు కానివ్వరని జిల్లా కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌పై వైటనర్, ఎరేజర్, వివిధ రకాల ట్యాంపరింగ్ పాల్పడితే ఆ ఓఎంఆర్ షీట్ చెల్లదని దీనిని అభ్యర్థులు గమనించి పరీక్ష రాయాలని సూచించారు.
ఏఎన్‌ఎం పోస్టుకు దరఖాస్తులు..
జిల్లాలోని గిరిజ సంక్షేమ ప్రీ మెట్రిక్ హాస్టల్‌లో ఉన్న ఒక ఏఎన్‌ఎం పోస్టుకోసం ఆసక్తి గల వారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన పని చేయడానికి 18 నుండి 44 ఏళ్ల వయసు, ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో ఏఎన్‌ఎం శిక్షణలో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

గిరిజన విద్యా సంస్థల్లో పని చేసిన అనుభవం ఉన్న వారికి సంవత్సరానికి 5 శాతం గరిష్టంగా 4 ఏళ్లకు 20 శాతం వెయిటేజీ ఉంటుందని, అర్హత పరీక్షల్లో మెరిట్ మార్కులు, టీడబ్లుడీ విద్యా సంస్థల్లో పనిచేసిన అనుభవానికి వెయిటేజీ ద్వారా ఎంపిక ఉంటుందన్నారు. నెలకు రూ.22,750 వేతనం కాగా, ఆన్‌లైన్‌లో అభ్యర్థులు తమ దరఖాస్తులను జూలై 13 లోగా https://tsobmms.cgg.gov.inలో చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9652118867, 9985444266 నెంబర్లలో సంప్రదించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News