Friday, November 22, 2024

విద్యుత్ శాఖలో లైన్ ఉమెన్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు

- Advertisement -
- Advertisement -

Candidates waiting for Line Woman posting

 

మన తెలంగాణ,  హైదరాబాద్ : లైన్ ఉమెన్ నియమకాలపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇప్పటికే రాత పరీక్షలతో పాటు స్తంభాలు ఎక్కే పరీక్షలో (పోల్ క్లైంబింగ్ టెస్ట్) విజయం సాధించి అన్ని విధాలుగా తమ సమర్దతను నిరూపించినప్పటికి వారికి ఇప్పటికి పోస్టింగ్ రాలేదు. ఒక వైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలకమైన పోలీసు, ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ నేవి వంటి రంగల్లో మహిళాభ్యున్నతికి ప్రాధాన్యత ఇస్తుంటే దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టిఎస్‌ఎస్‌పిడిసీఎల్)లో మాత్రం మహిళల పట్ల వివక్షతను ప్రదర్శిస్తూనే ఉన్నారు. అధికారుల తీరు కారణంగా లైన్‌ఉమెన్‌గా ఇప్పటికే అన్ని అర్హతలు సాదించిన వి.బారతి. బి. శిరీశలకు సంత్సరం కాలంగా నిరీక్షణ తప్పలేదు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ 2019 సెప్టెంబర్‌లో28న 2500 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. డిస్కం చట్టం ప్రకారం దరఖాస్తు ఫామ్‌లో మహిళలకు ఆప్షన్ ఇవ్వలేదు. అయితే అప్పటికే ఐటిఐ ఎలక్ట్రికల్ కోర్సు పూర్తి చేసిన మహబూబ్‌బాద్‌కు చెందిన భారతి, సిద్దిపేటకు చెందిన శిరీషతో సహా మరో 30 మంది మహిళలు తమ భవిష్యత్‌పై ఆందోళనతో న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో కోర్టు వారి విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలించింది. కోర్టు ఆదేశాలమేరకు 34 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. పురుష అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహించినప్పటికి మహాళా అభ్యర్థులకు మాత్రం అవకాశం రాలేదు. దాంతో వారు తిరి మళ్ళీ కోర్టును ఆశ్రయించారు.దీంతో 2019 డిసెంబర్ 15న వీరికి రాత పరీక్ష నిర్వహించారు.

ఈ రాత పరీక్షలో ఇద్దరు మాత్రమే ( భారతి, శిరీష) అర్హత సాధించారు.అప్పటికే పురుష అభ్యర్థులకు పోల్ క్లౌంబింగ్ టెస్ట్ నిర్వహించి మహాళా అభ్యర్థులకు మాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో వారు మళ్ళీ కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు డిసెంబర్ 23 వీరికి ఎర్రగడ్డలోని సెంట్రల్ పవర్ ఇనిస్టిట్యూషన్‌లో పోల్ క్లౌంబింగ్ పరీక్ష నిర్వహించారు. వీరిద్దరు 8 మీటర్ల ఎత్తున్న విద్యుత్ స్తంభాన్ని సులభంగా ఎక్కి తాము పురుషులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు. అంతే కాదు సంస్థలో తొలి లైన్‌ఉమెన్‌గా చరిత్ర సృష్టించారు. అయితే వీరికి ఇంకా పోస్టింగ్ ఆర్డ్‌ర్స్ ఇవ్వకపోవడంతో మళ్ళీ వారు కోర్డును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ కేసు హై కోర్టులోని 9వ నెంబర్ సింగ్ బెంచ్‌వద్ద పెండింగ్‌లతో ఉండటంతో నిరీక్షణ తప్పలేదు.

పోస్టింగ్ కోసం ఎంత కాలం ఎదురు చూడాలి 

జూనియర్ లైన్‌మెన్ పోస్టుకు 2019లో నోటిఫికేషన్ వచ్చిందని, దానిలో ఫీమేల్ అనే అప్షన్ లేక పోవడంతో కోర్టును ఆశ్రయించామని మహిళా అభ్యర్థులు శిరీష,భారతి తెలిపారు. తాము కోర్టును అనుమతితో అన్ని పరీక్షల్లో అర్హత సాధించినా పోస్టింగ్ ఇవ్వలేదని దాంతో తాము తిరిగి కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. తాము పరీక్ష రాస్తున్నప్పడు పురుష అభ్యర్థులు నవ్వుకున్నారని, అయినా నిరుత్సాహపడకుండా అన్ని అర్హతలు సాధించినా పోస్టింగ్‌ల కోసం ఎదురు చూడాల్సి పరిస్థితి ఏర్పడిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News