మేమంతా హరీశ్‌రావు వెంటే ఉంటాం
హరీశ్‌రావు బిఆర్‌ఎస్‌కు మూలస్తంభంగా కొనసాగుతారు…
మైనంపల్లి వ్యాఖ్యలపై ఖండన
ట్విట్టర్ వేదికగా మంత్రి కెటిఆర్ వెల్లడి
మన తెలంగాణ/హైదరాబాద్ : వచ్చే శాసనసభ ఎన్నికల్లో భాగంగా ముందుగానే బిఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను పార్టీ అధ్యక్షుడు, సిఎం కెసిఆర్ విడుదల చేశారు. 119 స్థానాలకు గానూ 115 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన అభ్యర్థులు సంబురాల్లో మునిగిపోగా, టికెట్లు దక్కని అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ట్విట్టర్ వేదికగా తమ సందేశాన్ని తెలియజేశారు. అమెరికా పర్యటనలో ఉన్న మంత్రి కెటిఆర్ ఎంఎల్‌ఎ టికెట్లు దక్కించుకున్న అభ్యర్థులందరికీ అభినందనలను ట్విట్టర్ వేదికగా తెలిపారు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు కెటిఆర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ప్రజా జీవితంలో నిరాశ, నిస్పృహాలు ఎదురవుతాయి. సామర్థం కలిగిన కొంత మంది నాయకులకు దురదృష్టవశాత్తూ టికెట్లు లభించలేదు. ఉదాహరణకు క్రిశాంక్‌తో పాటు అలాంటి కొంత మంది నాయకులకు అవకాశం రాలేదు. వీరందరికి ప్రజలకు సేవ చేసేందుకు మరొక రూపంలో అవకాశం ఇస్తామని కెటిఆర్ ప్రకటించారు.
మేమంతా హరీశ్‌రావు వెంటే ఉంటాం…
రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుపై మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు. తన కుటుంబ సభ్యునికి టికెట్ నిరాకరించిన మన ఎంఎల్‌ఎ ఒకరు మంత్రి హరీశ్‌రావుపై కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. మేమంతా హరీశ్‌రావు వెంట ఉంటాం, అయనకు అండగా ఉంటామని కెటిఆర్ స్పష్టం చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి హరీశ్‌రావు ఉన్నారు. హరీశ్‌రావు బిఆర్‌ఎస్ మూలస్తంభంగా కొనసాగుతారని కెటిఆర్ పేర్కొన్నారు.
One of our MLAs who was denied a ticket to his family member in an outburst has made some derogatory comments on Minister Harish Rao Garu
I not only strongly condemn the MLA’s behaviour and also want to make it clear that we all stand with @BRSHarish Garu
He has been an…
— KTR (@KTRBRS) August 21, 2023