Sunday, December 22, 2024

బిగ్ బాస్ ఫేమ్.. షణ్ముఖ్ సోదరుడి ఇంట్లో గంజాయి

- Advertisement -
- Advertisement -

తెలుగు బిగ్‌ బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ సోదరుడు సంపత్ ఇంట్లో గంజాయి లభించింది. షణ్ముఖ్ సోదరుడు సంపత్ వినయ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ పేరుతో మోసం చేశాడని సంపత్ వినయ్ పై యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు విచారణ కోసం పుప్పాలగూడలోని సంపత్ ఇంటికెళ్లారు. సంపత్ ఇంట్లో గంజాయి గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సంపత్‌ వినయ్‌ వద్ద 16 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం షణ్ముఖ్ , సంపత్‌లను కలిపి పోలీసులు విచారిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News