Wednesday, January 22, 2025

అత్తాపూర్ లో గంజాయి కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో గంజాయి కలకలం సృష్టిస్తోంది. ముషక్ మహల్ పాత భవనం వద్ద గంజాయి విక్రయిస్తున్న కేటుగాళ్లను ఎస్ఓటి పోలీసులు పట్టుకున్నారు. ఐదు మందిని రెడ్ హ్యాండెడ్ గా రాజేంద్రనగర్ ఎస్ఒటి టీమ్ పట్టుకుంది. వారి వద్ద నుంచి రెండున్నర కిలోల గంజాయి తోపాటు ఐదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎన్ డిపిఎస్ యాక్టు కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు… ఎవరికి అమ్ముతున్నారు అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News