Wednesday, January 22, 2025

ఆన్‌లైన్‌లో గంజాయి చాక్లెట్స్ బిజినెస్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇండియా మార్ట్ ద్వారా ఆర్డర్ పెడితే పలు సంస్థలు గంజాయి చాక్లెట్లను డెలివరీ చేస్తున్నాయి. టిజి ఎఎన్‌బి డైరెక్టర్ సందీప్ శాండిల్యా బృందం పక్క ఆధారాలతో ఆపరేషన్ డెకాయి నిర్వహించారు. ఇండియా మార్ట్‌లో సందీప్ శాండిల్యా బృందం ఈ గంజాయి చాక్లెట్లను ఆర్డర్ పెట్టడంతో డెలవరీకి వచ్చారు. చాక్లెట్లను టెస్టు చేయగా గంజాయ అనవాళ్లు బయటపడ్డాయి. రాజస్థాన్, యుపిలో ఉన్న 8 కంపెనీలను పోలీసులు గుర్తించారు.

ఈ విషయాన్ని టిజి ఎఎన్‌బి అధికారులు ఎని సిబి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లతో కలిసి యుపి వెళ్లి గంజాయి చాక్లెట్లను అమ్మే ఇద్దరు కంపెనీ యజమానులను అరెస్ట్ చేశారు. రాజస్థాన్‌లో 7 కంపెనీలను గుర్తించి అక్కడి నుండి నమూనాలు తీసుకొని ఫోరెన్సిక్ నివేదిక పంపించారు. ఫోరెన్సిక్ నివేధిక వచ్చిన తరువాత  ఆకంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఎెఎన్ బి అధికారులు నిర్ణయించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News