- Advertisement -
షాద్‌నగర్: రంగారెడ్డి జిల్లాలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్న నలుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్‌నగర్ మండలంలోని రైతుకాలనీలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నారు. ఈ ముఠా గుట్టుచప్పుడు కాకుండా కిరాణదుకాణంలో అమ్ముతున్నట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న ఎక్సైజ్ అధికారులు బుధవారం రాత్రి తనిఖీలు చేసి గంజాయి చాక్లెట్లు పట్టుకున్నారు. ఈ ముఠా నందిగామలోనూ గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి మొత్తం 480 గంజాయి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -