- Advertisement -
మధిర : భువనేశ్వర్ టు ముంబై ఎక్స్‌ప్రెస్ లో మధిర రైల్వే స్టేషన్లో సుమారు 12 కేజీల గంజాయి ప్యాకెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మధిర ఎక్సైజ్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ సీఐ కె.నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. గంజాయి రవాణా విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.
ఎక్సైజ్ సీఐ కే నాగేశ్వరరావు మాట్లాడుతూ గంజాయి మధిర పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అమ్మకం జరిపినట్లయితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ ఎస్సై శార్వాణి మరియు ఎక్సైజ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -