Thursday, January 23, 2025

అరకులో గంజాయి వనాలు

- Advertisement -
- Advertisement -

Cannabis cultivation on thousand acres near Araku

వెయ్యి ఎకరాల్లో సాగు
గంజాయి నుంచి హష్ ఆయిల్ తయారు చేస్తున్న నాగేశ్ అరెస్టు

n వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు
n డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నగేశ్ అరెస్ట్
n లక్ష్మీపతి, నాగేశ్‌లకు దేశవ్యాప్తంగా 80 మందితో నెట్‌వర్క్
n నార్కోటిక్ వింగ్ డిసిపి చక్రవర్తి వెల్లడి

మనతెలంగాణ/హైదరాబాద్ : బంజారాహిల్స్ డ్రగ్స్ కేసులో డ్రగ్స్ సప్లయర్ నాగేశ్వరరావు, లక్ష్మీపతిలను అరెస్ట్ చేసినట్లు నార్కోటిక్ వింగ్ డిసిపి చక్రవర్తి తెలిపారు. నగరంలోని నల్లకుంట పోలీస్‌స్టేషన్‌లో బుధవారం నాడు ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో డ్రగ్స్ కేసు నిందితుల నేర చరిత్రను డిసిపి చక్రవర్తి వెల్లడించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఓ డ్రగ్స్ కేసులో పోలీసులు తీగలాగితే విశాఖపట్నం అరకు సమీపంలోని లోగిలి గ్రామానికి చెందిన నగేశ్ వెయ్యి ఎకరాల్లో గంజాయి సాగు చేస్తూ దాని నుం చి హాష్ ఆయిల్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నగేశ్ కుటుంబసభ్యులు, బంధుమిత్రులంతా ఇదే దందా సాగిస్తున్నారని డిసిపి వెల్లడించారు.ఈక్రమంలో డ్రగ్స్ కేసులో లక్ష్మీపతి హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్న నాగేశ్‌లను విచారించడంతో అరకులో పెద్ద ఎత్తున గంజాయి నుంచి హాష్ ఆయిల్ తయారీ చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యిందని తెలిపారు. డ్రగ్స్ కేసులోని నిందితులు లక్ష్మీపతి, నాగేశ్‌లు దేశవ్యాప్తంగా 80మంది నెట్‌వర్క్‌తో హాష్ ఆయిల్ సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు.

దేశవ్యాప్తంగా లక్ష్మీపతి, నాగేశ్వరరావులు 80 మందికి రెగ్యులర్‌గా గంజాయి, హాష్ ఆయిల్‌లను సరఫ రా చేస్తున్నారని చెప్పారు. ఈక్రమంలో ఒడిశాలో 14 మంది, తమిళనాడులో 13, కర్ణాటకలో 17, ముంబైలో 15 మంది, గోవాలో 13, హైదరాబాద్ 8మంది డ్రగ్ పెడ్లర్లు ఉన్నారని విచారణలో తేలిందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు లక్ష్మీపతి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న నెట్‌వర్క్‌తో హైదరాబాద్, ఒడిశా, తమిళనాడు,కర్ణాటక,ముంబై,గోవా, హైదరాబాద్, బెంగళూరులలో గంజాయి, హాష్ ఆయిల్ విక్రయాలు సాగిస్తున్నాడన్నారు. ముఖ్యంగా వాట్సాప్, స్నాప్ చార్ట్, ఇన్‌స్టా గ్రాం, టెలిగ్రాం, వీ-చాట్‌లో గ్రూపులు ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెలుగుచూసిందన్నారు. ఈక్రమంలో లక్ష్మీపతిపై గతంలో 6 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయన్నారు.

లక్ష్మీపతి, ఎపిలోని అరకు చెం దిన నాగేశ్వరరావు నుంచి రూ.50 వేలకు హాష్ ఆయిల్ కొనుగోలు చేసి రూ.6 లక్షలకు అమ్ముతున్నారని తెలిపారు. ఎపిలోని అరకులో నాగేశ్వరరావు, అతని బంధువులు వందలాది ఎకరాల్లో పెద్ద ఎత్తున గంజాయి సాగు చేయడంతో పాటు గంజాయిని హాష్ ఆయిల్‌గా మార్చి అమ్ముతున్నారని విచారణలో తేలిందన్నారు. గంజాయి తీసుకుంటున్న వంశీ కృష్ణ, విక్రమ్ అరెస్ట్ చేశామని, 840 గ్రాముల హాష్ ఆయిల్ సీజ్ చేశామని తెలిపారు. డగ్స్ తీసుకుని బిటెక్ విద్యార్థి మృతిచెందిన సంగతి తెలిసిందేనని అయితే ఆ బిటెక్ విద్యార్థికి డ్రగ్స్ సరఫరా చేసిన లక్ష్మీపతి ముఠా అని పోలీసులు తేల్చామన్నారు. ఇంజినీరింగ్ విద్యార్థులను డ్రగ్స్ ముఠా ఎలాట్రాప్ చేసిందనే వివరాలను సైతం డిసిపి వెల్లడించారు.

డ్రగ్స్ సరఫరాదారు లక్ష్మీపతి హాష్ ఆయిల్ విక్రయిస్తూ 2016లో రెండు పర్యాయాలు అరెస్టు అయ్యాడని, అదేవిధంగా హాష్ ఆయిల్ కేసులో విశాఖలో లక్ష్మీపతి అరెస్టయ్యాడని తెలిపారు. లక్ష్మీపతి నుంచి గంజాయి, హాష్ ఆయిల్ కొనుగోలు చేయడంతో పాటు విక్రయాలు జరిపిన వంశీకృష్ణ, విక్రమ్‌ల నుంచి 840 గ్రాముల హాష్ ఆయిల్ రూ.5 లక్షల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నామని వివరించారు. అలాగే వీరితో పాటు మదన్, రాజు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించి వారి నుంచి 5 గ్రాముల హాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నగేశ్‌కు ఇతర రాష్ట్రాల డ్రగ్స్ వినియోగదారులతో సంబంధాలు. ఒడిశా, తమిళనాడు, దిల్లీ, ముంబయి వినియోగదారులతో సంబంధాలున్నాయని తెలిపారు. గత వారం పెడ్లర్ ప్రేమోపాధ్యాయ్‌తో పాటు ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న పోలీసులు లక్ష్మీపతి కోసం గాంలించగా మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో పట్టుబడ్డాడని డిసిపి తెలిపారు. అతని నుంచి రాబట్టిన ఆధారాలతో నగేశ్‌ను అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు నిందితుల సంఖ్య 7కి చేరిందని డిసిపి వివరించారు.

అరకులో గంజాయి సాగు

అరకులో నాగేశ్, అతని బంధువులు దాదాపు వెయ్యి ఎకరాల్లో గంజాయి పండిస్తూ హాష్ ఆయిల్ తయారీ చేస్తున్నట్లు విచారణలో తేలిందని డిసిపి వివరించారు. నాగేశ్, అతని బంధువులు ఐసో ఫ్రొఫైల్ ఆల్కహాల్‌లో గంజాయి మొగ్గలను మరిగించి దాని ద్వారా వచ్చే ద్రావణం హాష్ ఆయిల్‌ను సరఫరా చేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ క్రమంలో హాష్ ఆయిల్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు ఎవరెవరికి సరఫరా చేస్తున్నారనే విషయాలను నార్కోటిక్ విభాగం పోలీసులు సేకరిస్తున్నారన్నారు. ఇటీవల హైదరాబాద్ నగరంలోని నల్లకుంట్లకు చెందిన ఓ బిటెక్ విద్యార్థి మాదకద్రవ్యాలకు బానిసై మృతి చెందడంతో మాదక ద్రవ్యాలు సరఫరా చేసిన ప్రేమ్‌ఉపాద్యాయ్‌తో పాటు ముగ్గురు వినియోగదారులను వారం క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ప్రేమ్ ఉపాద్యాయ్‌కు హాష్ ఆయిల్‌ను లక్ష్మీపతి సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలడంతో అతనితో పాటు గంజాయి సాగు చేయడతో పాటు విక్రయాలు సాగిస్తున్న నాగేశ్‌ను అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News