Wednesday, January 29, 2025

పుష్ప సీన్ రిపీట్… రూ.72 లక్షల గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

సినీ ఫక్కీ తరహాలో తరలింపు

290 కేజీలు, రూ. 72 లక్షల 50 వేల విలువగల గంజాయి పట్టివేత

మన తెలంగాణా/ఆసిఫాబాద్ ప్రతినిధి: సినీఫక్కీ తరహాలో లారి ఆయిల్ ట్యాంకర్ లో అక్రమంగా తరలిస్తున్న 72 లక్షల విలువ గల గంజాయిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. జిల్లా ఎస్పీ డి వి శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్ర లోని అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దు లో చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగిందని, అందులో భాగంగా పోలీసులు వాహనాలను తనిఖీ చేయడంతో ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి మధ్యప్రదేశ్ కి ఆయిల్ ట్యాంకర్ లో తరలిస్తున్న 290 కిలోల గంజాయిని పట్టుకున్నామని వివరించారు. ఎంపి 06 హెచ్ సి 1339 అనే నంబరు గల లారీ ఆసిఫాబాద్ వైపు నుండి మహారాష్ట్ర వైపుకు వెళ్తుండగా వాహనాన్ని పోలీసులు ఆపారు. లారీ డ్రైవర్ అనుమానాస్పదంగా కన్పిచడంతో వాహనాన్ని తనిఖీ చేయడంతో భారీ మొత్తంలో గంజాయి లభ్యమైంది.

నిందితుడు తెలిపిన వివరాల ప్రకారం… మహారాష్ట్రకు చెందిన అరబింద్ అనే వ్యక్తి తనను గంజాయి సరఫరా కోసం రాజమండ్రికి పంపాడని, గంజాయిని అక్కడ లోడ్ చేసుకుని తిరిగి వస్తున్న క్రమంలో వాంకిడిలో పట్టుబడినట్లు తెలిపాడు. నిందితుడి నుంచి 145 గంజాయి ప్యాకెట్స్, ఒక్కొక్కటి సుమారు రెండు కేజీల చొప్పున, మొత్తం 290 కిలోల బరువు, 72 లక్షల 50 వేల రూపాయల విలువ ఉంటుందని తెలియజేశారు. ఒక లారీ, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. గంజాయి సరఫరా చేస్తున్న లారీ డ్రైవర్ ను అరెస్టు చేశామని, ఈ గంజాయి సరఫరాలో ముఖ్య నిందితుడు అయిన అరబింద్ ను పట్టుకోనుటకు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్ కు పంపినట్లు ఎస్పి తెలిపారు. గంజాయి పట్టివేతలో ఆసిఫాబాద్ డిఎస్పి కరుణాకర్, వాంకిడి సిఐ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్ , ఆసిఫాబాద్ సిఐ రవీందర్, వాంకిడి ఎస్ఐ ప్రశాంత్, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News