రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలో మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న షాపు యజమానిని పోలీసులు అరెస్ట్ చేశారు. మత్తు చాక్లెట్ల విక్రయంపై పోలీసులు బుధవారం దర్యాప్తు చేశారు. మత్తు చాక్లెట్లు విక్రయిస్తున్న పాన్ షాప్ యజమానిని అదుపులోకి తీసుకున్నారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి దర్యాప్తు చేపట్టారు. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల వద్ద ఓ వ్యక్తి పాన్ షాప్ నడుపుతూ విద్యార్థులకు మత్తు చాక్లెట్లు అమ్ముతున్నాడు. చాక్లెట్లు తిని పాఠశాల విద్యార్థులు మత్తులోకి జారుకుంటున్నారు. మత్తులో కొన్నాళ్లుగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్నారు.
అనుమానం వచ్చిన పాఠశాల ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన ఎస్వోటీ పోలీసులు పాన్ షాప్ పై దాడి చేసి చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. చాక్లెట్లలో గంజాయి కలిపినట్లు పోలీసులు గుర్తించారు. పాన్ షాపులో 8 కిలోల చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒడిశాకు చెందిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి రూ. 1.30 లక్షల విలువైన 42 ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.