Monday, January 20, 2025

మిర్చిలో అంతర్ పంటగా గంజాయి సాగు

- Advertisement -
- Advertisement -

సాగుదారునిపై కేసు నమోదు

Cannabis planted in Mirchi crop

మన తెలంగాణ/ గుండాల : మండల పరిదిలోని కాచనపల్లి పంచాయతీ పరిధిలోని లక్ష్మిదేవిపల్లి పోడుసాగు భూమిలో మిర్చి పంటలో రహస్యంగా అంతర్ పంటగా గంజాయి పంటను సాగుచేస్తున్న జగ్గుతండాకు చెందిన బానోత్ వస్రామ్ ఇల్లందు ఎక్సైజ్, ఆళ్లపల్లి పోలీసులకు అందిన సమాచారంతో సోమవారం పంట సాగుచేసిన ప్రదేశానికి వెల్లి ఎండపెట్టిన గంజాయితోపాటు, సాగుచేసిన మొక్కలను ధ్వంసంచేసి స్వాధీన పరుచుకున్న సంఘటన సోమవారం చోటుచేసుకుంది. నిందితుడు వస్రామ్‌ను అదుపులోకి తీసుకొని కాచనపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్వాధీనం చేసుకున్న ముడిసరుకు గంజాయిని తహసీల్దారు రంగు రమేష్ సమక్షంలో పంచనామా నిర్వహించారు. నిందితునిపై కేసు నమోదుచేసి మంగళవారం ఇల్లందు కోర్టుకు తరలించనున్నట్లు టేకులపల్లి సిఐ బానోత్‌రాజు తెలిపారు. ఈ దాడిలో ఎక్సైజ్ సిఐ రాజశేఖర్, ఆళ్ళపల్లి ఎస్సై సంతోష్, ఎక్సైజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News