Sunday, December 22, 2024

జగద్గిరిగుట్టలో భారీగా గంజాయి పట్టివేత

- Advertisement -
- Advertisement -

Cannabis Seized in Jagadgiri Gutta

జగద్గిరిగుట్ట: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో గంజాయి ముఠా గురువారం పట్టుబడింది. కారులో తరలిస్తున్న గంజాయి అధికారులు పట్టుకున్నారు. జూమ్ లో కార్లు బుక్ చేసుకుని గంజాయి తరలిస్తున్నట్టు గుర్తించారు. విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు తరలిస్తున్న 104 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువు రూ.15 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. గంజాయి తరలిస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశామని, వారి వద్ద నుంచి కారు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News