Monday, December 23, 2024

భారీగా గంజాయి పట్టి వేత

- Advertisement -
- Advertisement -

ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌లో సాగు అయ్యే గంజాయికి మంచి డిమాండ్. శీలావతి అనే గంజాయికి పలు రాష్ట్రాల్లో మంచి గిరాకీ ఉంది. దీంతో చాల మంది గంజాయి అక్రమ రవాణదారులు లక్షలు ఖర్చు చేసి ఒరిస్సా, ఏపీ రాష్ట్రాల్లో ఈ గంజాయిని సాగు చేయిస్తారు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, గోవాతో పాటు పలు రాష్ట్రానికి గంజాయి అక్రమంగా తరలిస్తు ఉంటారు. కాని గంజాయిని అక్రమంగా తరలించాలంటే ఎవ్వరైనా తెలంగాణ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. సీఎం రేవంత్‌రెడ్డి డ్రగ్స్, గంజాయిని రవాణ, వినియోగం, అమ్మకాలు లేకుండా చూడాలన్న ఆదేశాల మేరకు దాడులు నిర్వహిస్తున్న క్రమంలో మెదక్ జిల్లా సంగారెడ్డి ప్రాంతంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు తనిఖీల్లో 115 కిలోల గంజాయి పట్టుబడింది. ఒరిస్సా, ఏపీ నుంచి ఖమ్మం మీదుగా అక్రమంగా రవాణా అవుతున్న 110 కిలోల గంజాయి, రూ. 40 వేల నగదు తో పాటు రెండుకార్లు,

ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ మెంట్ అసిస్టెంట్ కమిషనర్ జి . శ్రీనివాసరెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళితే ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు అక్రమంగా రెండు కార్లలో గంజాయి రవాణా అవుతున్న సమాచారంమేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగం శనివారం సంగారెడ్డి జిల్లా జాతీయ రహదారి 65 పూణే నుంచి మచిలీపట్నం వెళ్లె రహదారిలో కంకోల్ టోల్ గేట్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. అనుమానం వచ్చిన రెండు కార్లను నిలిపి కారులో తనిఖీలు చేయగా రెండు కార్లలో 115 కిలోల గంజాయి పట్టుబడిoది. రెండు కార్లతో పాటు వారి వద్ద రూ. 40 వేల నగదుతోపాటు నిందితుల వద్ద ఉన్న 6 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న గంజాయి, కార్ల విలువ కలిపి రూ. 38.40 లక్షల విలువ ఉంటుందని అంచనా వేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. ఈ కేసులో మహారాష్ట్ర బాబా సామశ్రీబ్ ఏక్‌నాథ్ ఖాదార్, అంజీనాథ్ గహీనాథ్ బాడేలను అరెస్టు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఎన్‌డీపీఎస్ చట్టం ప్రకారం పట్టుకున్న గంజాయిని వీడియో తీయించారు. ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్ర పతన్‌పూర్ మునిసిపాలిటీ రాయ్ ఘడ్ జిల్లా నుంచి గంజాయిని కొనుగోలు చేసి మహారాష్ట్రకు తీసుకువెళుతున్నట్లు నిందితులు తెలిపారు. ఈ గంజాయిని మహారాష్ట్రలోని ఆహ్మద్‌నగర్ పరతాడి టౌన్‌కు గంజాయిని తరలిస్తున్న క్రమంలో సంగారెడ్డి ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులకు పట్టుబడ్డారు. గంజాయిని పట్టుకున్న వారిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరిండెంట్ కె. శ్రీనివాసరావు, బి.గాంధీ నాయక్, పి. వీణారెడ్డి, సిహెచ్ చంద్రాశేఖర్, బియాదయ్య, ఏ.అనిల్ కుమార్ ఉన్నారు. గంజాయిని పట్టుకున్న బృందాన్ని ఎక్సైజ్ ఎక్సైజ్ కమిషనర్ ఇ.శ్రీధర్, ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టర్ వీ.బీ కమలాసన్‌రెడ్డి, మెదక్ డిప్యూటీ కమిషనర్ కె. హరికిషన్, అసిస్టెంట్ కమిషనర్ జి . శ్రీనివాసరెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News