Wednesday, January 22, 2025

గంజాయి విక్రేత అరెస్టు

- Advertisement -
- Advertisement -

గంజాయి విక్రేత అరెస్టు
3కిలోల గంజాయి స్వాధీనం

మనతెలంగాణ, సిటిబ్యూరో: బీహార్ నుంచి గంజాయి రవాణా చేస్తున్న నిందితుడిని చౌటుప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 3కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బీహార్‌కు చెందిన లాలుదాస్ నాగారంలో ఉంటూ కూలీ పనిచేస్తున్నాడు. రెండేళ్ల క్రితం నిందితుడు బతుకు దెరువు కోసం నగరానికి వచ్చాడు. సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసిన నిందితుడు బీహార్ రాష్ట్రం నుంచి తక్కువ డబ్బులకు గంజాయి కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకుని వచ్చి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు ఈ నెల 7వ తేదీన గంజాయి తీసుకుని వచ్చి రాత్రి సమయంలో చౌటుప్పల్ బస్టాండ్‌లో నిద్రించాడు. పోలీసులు ఆకస్మికంగా బస్టాండ్‌ను తనిఖీ చేయగా నిందితుడి వద్ద గంజాయి లభించింది. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్ష రూపాయలు ఉంటుంది. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News