Sunday, December 22, 2024

రూ.౩ కోట్ల విలువ చేసే గంజాయి దహనం

- Advertisement -
- Advertisement -

రూ.౩ కోట్ల విలువ చేసే 1,186 కిలోల గంజాయిని సోమవారం ఎక్సైజ్ అధికారులు దహనం చేశారు. భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు కేసుల్లో పట్టుబడిన గంజాయిని ఎడబ్లూఎస్ కన్సల్టింగ్ లిమిటెడ్, గోపాల్‌పేట్ తల్లెడ మండలంలోని దహన కేంద్రంలో దగ్ధం చేయించారు. ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేశ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జానయ్య, భద్రాచలం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ సిఐ రహీం ఉన్నీసా బేగం సమక్షంలో దగ్ధం చేయించారు. భారీ మొత్తంలో పట్టుబడిన గంజాయిని దగ్ధం చేయించిన ఎక్సైజ్ పోలీసులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News