Wednesday, November 13, 2024

కేన్స్ కంపెనీ తరలిపోతున్నది

- Advertisement -
- Advertisement -

తరలిపోతున్న పెట్టుబడులపై కెటిఆర్ ఆవేదన
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో ఏర్పడిన పెట్టుబడుల సంస్థ పక్క రాష్ట్రానికి తరలిపోతోందని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బిఆర్‌ఎస్ హయంలో రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకొచ్చేందుకు పరిశ్రమలను ఏర్పాటు చేయాగా అవి తరలిపోతున్నందుకు తమ కృషి నిష్ఫలం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ రం గంలో కీలకమైన పెట్టుబడిగా భావిస్తున్న కేన్స్ సెమికాన్ సంస్థ తెలంగాణ నుంచి గుజరాత్‌కు తరలిపోతున్నట్లు వచ్చిన వార్తలపై ఎక్స్ వేదికగా స్పందించారు. ఇదే కంపె నీ గతంలో కర్ణాటక రాష్ట్రానికి వెళ్లేందుకు సిద్ధమైనప్పుడు ఎన్నో ప్రయత్నాలు చేసి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించామని గుర్తు చేశారు. కొంగరకలాన్ లో ని ఫాక్స్‌కాన్ పరిశ్రమకు దగ్గరగా భూమి కేటాయింపు కావాలంటే కేవలం పది రోజుల్లోపే అవసరమైన భూ మిని కేటాయించి, కంపెనీని ఒప్పించినట్లు వివరించా రు. కేన్స్ కంపెనీ యూనిట్ ఏర్పాటు, ఎలక్ట్రానిక్స్ తయా రీ రంగంతోపాటు సెమీ కండక్టర్ పరిశ్రమ ఎకో సిస్టమ్ కు అత్యంత కీలకమైనదని, పరిశ్రమ వస్తే రెండు రంగా ల్లో తెలంగాణ రాష్ట్రం మరింత పురోగతి సాధించే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే కంపెనీ యాజమాన్యా న్ని సంప్రదించి, వారితో చర్చలు జరిపి తెలంగాణ రాష్ట్రంలోనే పెట్టుబడులను కొనసాగించేలా ఒప్పించాలని సూచించారు.
‘కెసిఆరే మళ్లీ గెలిస్తేనే బుక్కెడు బువ్వ’ : ఓ రైతు వీడియోపై కెటిఆర్ స్పందన
మరోవైపు పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసిన ఓ రైతు వీడియోపై మాజీ మంత్రి కెటిఆర్ స్పందించారు. కెసిఆరే మళ్లీ గెలిస్తేనే తమకు బుక్కెడు బువ్వ అన్న నల్గొండ జిల్లా ముశంపల్లికి చెందిన మల్లయ్య అనే రైతును తాను త్వరలోనే వెళ్లి కలుస్తానని వెల్లడించారు. మల్లయ్య అనే రైతు మాట్లాడిన మాటలను ఓ వ్యక్తి రికార్డు చేసి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.కెసిఆర్ వచ్చిన తర్వాతనే బుక్కెడు బువ్వ తిన్నామన్న మల్లయ్య, ఇవాళ పొలాలు ఎండిపోతున్నాయి, మేకలు మేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కెసిఆర్ ఎక్కడున్నా ఆయనకే ఓట్లు వేస్తామన్న ఆయన, తనతో పాటు మరో పది మందితో ఓటు వేయిస్తానని చెప్పారు. తనకు రైతుబంధు కూడా రావడం లేదని, ఇప్పుడు తాను అప్పుల పాలు అయ్యానని మల్లయ్య పేర్కొన్నారు. మల్లయ్య వీడియోపై స్పందించిన కెటిఆర్, ఆ రైతు ఆవేదన తనను కదిలించిందన్నారు. త్వరలోనే ముశంపల్లి గ్రామానికి వెళ్లి మల్లయ్యతో పాటు బోర్ల రామిరెడ్డిని కలుస్తానని వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News