Monday, January 20, 2025

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023: భారత్ నుంచి అనుష్క శర్మ, మానుషి చిల్లర్…

- Advertisement -
- Advertisement -

ముంబై: ఫ్రాన్స్‌లో మే 16 నుంచి 76వ ఎడిషన్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఈ వార్షిక చలనచిత్రోత్సవంకు ప్రతి సంవత్సరం ప్రపంచ నలుమూలల నుంచి సినీ ప్రముఖులు హాజరవుతారు. ఇది 11 రోజుల ఈవెంట్.
బాలీవుడ్ నటి అనుష్క శర్మ, మానుషి చిల్లర్ తదితర భారత ప్రముఖ నటీనటులు దీనికి హాజరు కానున్నారు. హాలీవుడ్ నటి కేట్ విన్స్‌లెట్ సహా అనేక మంది సినిమా మహిళలను అవార్డులతో సత్కరించనున్నారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అనుష్క శర్మ పాల్గొనడం ఇదే తొలిసారి.

నటి అనుష్క శర్మతో పాటు నటి, 2017 ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ కూడా 2023 కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో పాల్గొనబోతున్నారు. గాయకుడు కుమార్ సాను కుమార్తె షానన్ కె. కూడా పాల్గొంటున్నారు. కంటెంట్ క్రియేటర్ డాలీ సింగ్ కూడా ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News