Tuesday, January 7, 2025

సనాతన్ ధర్మరక్షా బోర్డు ఏర్పాటుపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సనాతన ధర్మ రక్షా బోర్డు ఏర్పాటు కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని(పిల్) ఢిల్లీ హైకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయాలకు సంబంధించిన అంశమని, అటువంటి బోర్డు ఏర్పాటు చేయాలని తాము ప్రభుత్వాన్ని ఆదేశించలేమని చీఫ్ జస్టిస్ మన్మోహన్ నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో పిటిషనర్ ప్రభుత్వాన్ని ఆశ్రయించాలని ధర్మాసనం సూచించింది. సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిపై ఇతర మతాలకు చెందిన వారు దాడి చేస్తున్న దృష్టా తమ వారిని రక్షించేందుకు సనాత ధర్మ బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని పిటిషనర్ సనాతన్ హిందూ సేవా సంఘ్ ట్రస్టు తరఫు న్యాయవాది వాదించారు.

ఇతర మతాలకు ఇటువంటి బోర్డులు ఉన్నాయని, సనాతన ధర్మ రక్షా బోర్డు ఏర్పాటుకు సంబంధించి తమ విజ్ఞాపనకు ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు స్పందన లేదని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. ఇందుకు స్పందించిన ధర్మాసనం పిటిషనర్ కోరినట్లు ఆదేశాలు జారీ చేసే జ్ఞానం కాని శక్తి కాని తమకు లేవని అభిప్రాయపడింది. మీరు ప్రభుత్వాన్ని సంప్రదించాలి. మేము ఆ పని చేయలేము. పార్లమెంట్‌లో వారు(ఎంపీలు) దీన్ని ప్రస్తావిస్తారు. ఈ విషయంలో మేము ఏమీ చేయలేము. ట్రస్టు ఏర్పాటు చేయాలని మేము ఆదేశించలేము అని జస్టిస్ తుసార్ రావు గేదెలతో కూడిన ధర్మాసనం పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News