Wednesday, January 22, 2025

అభివృద్ధిని చూసి ఓర్వలేకనే దుష్ప్రచారం

- Advertisement -
- Advertisement -

గోదావరిఖని: రామగుండం నియోజక వర్గంలో జరుగుతున్న అభివృద్ధిని, సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక లక్ష్మినగర్‌లో సుమారు రూ 4 కోట్ల నిధులతో బిటి రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు పూజాకార్యక్రమం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజక వర్గ ప్రధాన వ్యాపార కేంద్రమైన లక్ష్మినగర్‌లో అభివృద్ధి పనులు చేపట్టాలంటే పకడ్బందీగా ప్రణాళికతో చేపట్టాలని అన్నారు. సిఎం కెసిఆర్ నేతృత్వంలో మంత్రి కెటిఆర్ సహకారంతో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమన్వయంతో రామగుండం నియోజక వర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు యన తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు బాలరాజ్‌కుమార్, అడ్డాల స్వరూప రామస్వామి, కల్వచర్ల కృష్ణవేణి, దొంత శ్రీనివాస్, పాముకుంట్ల భాస్కర్, నాయకులు పర్లపల్లి రవి, తోడేటి శంకర్ గౌడ్, పిల్లి రమేష్, పొన్నం లక్ష్మణ్, గణ్ముకుల తిరుపతి, కలువల సంజీవ్, రాకం వేణు, చెలుకలపల్లి శ్రీనివాస్‌తోపాతు తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News