న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి విరుచుకుపడ్డారు. అర్థంపర్థం లేని, అక్కెరకురాని ముచ్చట్లతో కోవిడ్-19ను కట్టడి చేయలేమని రాహుల్ విమర్శించారు. ప్రధాని నరేంద్రమోడీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాడటానికి, మీకు సరైన ఉద్దేశం, విధానం, సంకల్పం అవసరం. నెలకు ఒకసారి అర్థరహితమైన చర్చలు కాదు” అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. అంకిత భావం, చిత్తశుద్ధి, అర్థవంతమైన ప్రణాళిక లేకుండా మన్ కీ బాత్ పేరుతో అక్కెరకురాని ముచ్చట్లు చెప్పడంవల్ల ఏం ప్రయోజనముందని ఆయన ప్రధానిని ప్రశ్నించారు. ప్రధాని పదవిలో ఉండి ఇలాంటి ముచ్చట్లు చెప్పడం వృథా అన్నారు. ఇట్లాంటి పనికిరాని మాటలతో కోవిడ్ మహమ్మారిని కట్టడిచేయలేమని ట్విట్టర్ ద్వారా ఫైర్ అయ్యారు.
कोरोना से लड़ने के लिए चाहिए-
सही नीयत, नीति, निश्चय।महीने में एक बार निरर्थक बात नहीं!
— Rahul Gandhi (@RahulGandhi) May 30, 2021