- Advertisement -
ఐరాసలో భారత రాయబారి టిఎస్ తిరుమూర్తి
ఐక్యరాజ్యసమితి: పొరుగు దేశాలతో భారత్ సాధారణ సంబంధాలనే కోరుకుంటుందని ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో శాశ్వత ప్రతినిధి టిఎస్ తిరుమూర్తి స్పష్టం చేశారు. పాకిస్థాన్‌ని ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆగస్టు నెలకు ఐరాస భద్రతామండలికి తిరుమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. భద్రతామండలిలో 2021-22 ఏడాదికి భారత్ తాత్కాలిక సభ్యదేశంగా ఉన్నది. సిమ్లా ఒప్పందం ప్రకారం తమ మధ్య సమస్యల్ని భారత్, పాకిస్థాన్‌లు ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని తిరుమూర్తి గుర్తు చేశారు. అయితే, అందుకు తగిన వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత పాక్‌దేనని ఆయన తెలిపారు. హింసకు పాల్పడుతున్న ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వకుండా ఉండాలని తేల్చి చెప్పారు. సరిహద్దు నుంచి ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడకుండా కట్టడి చేయాలని ఆయన హితవు పలికారు.
- Advertisement -