హైదరాబాద్: మునుగోడు ఉపఎన్నికలో టిఆర్ఎస్ గెలుపును ఆపలేరని తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, థియేటర్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అనిల్ కుర్మాచలం అన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం బీజేపీకి అమ్ముడుపోయి మునుగోడు ఉప ఎన్నికకు కారణమయ్యారని, తమ స్వార్థం కోసం ప్రజల అభిమానాన్ని సొమ్ము చేసుకునే కోమటిరెడ్డి లాంటివారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. తాగునీటి కోసం గోసపడిన మునుగోడు ప్రజలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించి సీఎం కేసీఆర్ గారు ఫ్లోరైడ్‌ను రూపుమాపారని అన్నారు. దీనిని జీర్ణించుకోలేని బీజేపీ సర్కారు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. కోమటిరెడ్డి అసలు ఎందుకు రాజీనామా చేశాడో ఓటు వేసే ముందు ఒక్కసారి ప్రజలు విజ్ఞతతో వ్యవహరించి కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలన్ని కోరారు.