Sunday, December 22, 2024

తిరుమల లడ్డూల తయారీకి నందిని నెయ్యిని సరఫరా చేసి నష్టపోము: కెఎంఎఫ్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: తిరుమల లడ్డూల తయారీ కోసం నందినీ నెయ్యిని సరఫరా చేసి నష్టాలను చవిచూసే ప్రసక్తి లేదని కర్నాటక పాల సమాఖ్య(కెఎంఎఫ్) చైర్మన్ భీమా నాయక్ స్పష్టం చేశారు.

సోమవారం బెంగళూరులో రాయచూర్, బళ్లారి, కొప్పల్, విజయనగర జిల్లాల సహకార పాల ఉత్పిత్తిదారుల సొసైటీల సంఘం వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ కెఎంఎఫ్ అన్నది రైతుల సమాఖ్య అని, తిరుమలకు నెయ్యి సరఫరా చేసి నష్టపోవలసిన అవసరం ఉందా అని ప్రశ్నించారు. మార్కెట్‌లో నందిని నెయ్యికి పెద్దమొత్తంలో డిమాండు ఉందని, రూ. 610 చొప్పున కిలో నెయ్యిని వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారని ఆయన చెప్పారు. నందిని నెయ్యి పేరు మీద రాజకీయాలు చేస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.

సిద్దరామయ్య ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రాష్ట్రాన్ని ఎవరు పాలించారని, తిరుమలకు ఎన్ని లీటర్ల నెయ్యిని సరఫరా చేశారని నాయక్ ప్రశ్నించారు. నాలుగే ళ్ల బిజెపి పాలనలో తిరుమలకు ఒక్క లీటరు నెయ్యి కూడా సరఫరా చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఏడాదికి సగటున 30,000 టన్నుల నెయ్యిని కెఎంఎఫ్ ఉత్పత్తి చేస్తోందని ఆయన వివరించారు. అయితే మరో 10,000 లీటర్ల నెయ్యి కోసం డిమాండు ఉందని ఆయన చెప్పారు. పాల సేకరణ ధరను లీటరుకు రూ. 3 చొప్పున పెంచిన తర్వాత రోజుకు పాల సేకరణ 86 లోల లీటర్ల నుంచి 87 లక్షల లీటర్లకు పెరిగిందని ఆయన తెలిపారు.

రాలబురగి డివిజన్ మినహాయించి మిగిలిన అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు పాల పొడిని సరఫరా చేస్తున్నామని ఆయన తెలిపారు. పాల పొడి ఉత్పత్తి తగ్గడం వల్లనే కాలబురగి డివిజన్‌కు సరఫరా చేయలేకపోతున్నట్లు కెఎంఎఫ్ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News