Wednesday, December 25, 2024

జిహెచ్‌ఎంసిలో కంటోన్మెంట్ విలీనం?

- Advertisement -
- Advertisement -

జనావాసాలను కార్పొరేషన్‌లో చేర్చే అంశంపై
కమిటీ ఏర్పాటు ఫలించిన మంత్రి కెటిఆర్ కృషి

మనతెలంగాణ/హైదరాబాద్: కంటోన్మెంట్ పరిధిలోని ను బోర్డు పరిధి నుంచి తొలగించి జిహెచ్‌ఎంసిలో కలపాలన్న వినతు లు, డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. జ నావాసాలను కంటోన్మెంట్ నుంచి తొలగించి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో చేర్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర రక్షణశాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఎనిమిది మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేశారు. రక్షణశాఖ మరో అదన పు కార్యదర్శి, తెలంగాణ పురపాలక ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కంటోన్మెంట్స్ అదనపు డిజి, దక్షిణ కమాండ్ డైరెక్టర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధ్యక్షుడు, సిఈఓలు కమిటీలో సభ్యులుగా ఉ న్నారు.

కంటోన్మెంట్ నుంచి తొలగింపు, భూములు, స్థిరాస్థులు, బోర్డు ఉద్యోగులు, పెన్షనర్లు, నిధులు, పౌరసేవలు, చరాస్థులు, రోడ్ల నిర్వహణ, ట్రాఫిక్, రికార్డులు తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేసి నెల రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని కేంద్ర రక్షణశాఖ ఆదేశించింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్‌ఎంసిలో విలీనం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. మంత్రి కెటిఆర్ ప్రత్యేకంగా ఈ విషయమై పలు సందర్భా ల్లో కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ వినతులను అంగీకరించిన కేంద్ర ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విలీనానికి కమిటీ ఏర్పాటు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News